Acid Reflux | ఆసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేద పరిష్కారాలు!
Ayurveda Remedies for acid reflux: ఆసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సంబంధిత అసౌకర్యాల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేద చిట్కాలు చూడండి.
Ayurveda Remedies for acid reflux: ఆసిడ్ రిఫ్లక్స్ అనేది ఒక గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD). ఇది కడుపులోని అన్నవాహికలోకి వెనుకకు ప్రవహించడం వలన తలెత్తే పరిస్థితి. మందులు, జీవనశైలి మార్పులు, ఆహార మార్పులతో యాసిడ్ రిఫ్లక్స్ అసౌకర్యానికి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయుర్వేద వైద్యం ఈ పరిస్థితికి అన్నింటికి మించిన ప్రభావాన్ని కనబరుస్తుంది. సంపూర్ణ పరిష్కారాన్ని చూపిస్తుంది.
జీర్ణ సంబంధిత అసౌకర్యాలను ఉపశమనం చేయడం, శరీరంలోని దోషాలను (వాత, పిత్త, కఫా) సమతుల్యం చేయడంపై చికిత్స చేస్తుంది అని ఆయుర్వేద డాక్టర్ గీతి వర్మ చెప్పారు.
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీర్ణ సంబంధిత అసౌకర్యాల నుంచి ఉపశమనం కోసం పరిగణించవలసిన కొన్ని సూత్రాలు, ఆహార సిఫార్సులను డాక్టర్ గీతి వర్మ పంచుకున్నారు. అవేమిటో కింద చూడండి..
1. సాధారణ మార్గదర్శకాలు:
- ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో భోజనం చేయండి, మీ ఆహారాన్ని పూర్తిగా నమలండి.
- అతిగా తినడం, చాలా త్వరగా తినడం మానుకోండి, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
- నిర్ణీత భోజన సమయాలతో క్రమబద్ధంగా ఆహారాన్ని తీసుకోండి.
- మితిమీరిన మసాలా , ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది
- భోజనం మానేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది
- రాత్రిపూట భారీ భోజనం తినడం మానుకోండి.
2. ఆహారానికి సంబంధించిన సిఫార్సులు:
- మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోండి.
- పచ్చిగా తినడం, చల్లని ఆహారాల కంటే వండిన ఆహారాన్ని వేడివేడిగా తినండి, అవి సులభంగా జీర్ణమవుతాయి.
- బాస్మతి బియ్యం, క్వినోవా, బార్లీ వంటి వివిధ రకాల ధాన్యాలను ఆహారంలో చేర్చండి.
- నెయ్యి , కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను మితమైన మొత్తంలో తీసుకోండి.
- పెసర్లు, కాయధాన్యాలు, టోఫు వంటి సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్‌లను చేర్చండి.
- జీలకర్ర, కొత్తిమీర, పసుపు, అల్లం, మెంతి వంటి మసాలా దినుసులతో వంటకాలను ఉడికించాలి.
- మసాలా, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి లేదా నివారించండి, ఎందుకంటే అవి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
- లాక్టోస్ అసహనం లేని వారికి పాలు చాలా మంచి ఆహారం.
- కెఫిన్, ఆల్కహాల్, కార్బోనేటేడ్ పానీయాలు, టమోటాలు, సిట్రస్ పండ్ల వంటి ఆమ్ల ఆహారాలు తీసుకోవడం తగ్గించండి.
- రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకోండి, హైడ్రేటెడ్‌గా ఉండండి, కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ పరిమాణంలో నీరు త్రాగకుండా ఉండండి
3. మూలికా నివారణలు:
అలోవెరా జ్యూస్: భోజనానికి ముందు కొద్ది మొత్తంలో స్వచ్ఛమైన కలబంద రసాన్ని తాగితే జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది.
లైకోరైస్ టీ: లైకోరైస్ టీని సిప్ చేయండి, ఎందుకంటే ఇది అన్నవాహికలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
చమోమిలే టీ: ఒక కప్పు చమోమిలే టీని ఆస్వాదించండి, ఇది ప్రశాంతత, ఓదార్పు లక్షణాలను కలిగిస్తుంది.
ఇవి కాకుండా మంచి జీవనశైలిని అలవర్చుకోండి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం మానుకోండి. పడుకోవడానికి లేదా పడుకునే ముందు కనీసం రెండు నుండి మూడు గంటలు సమయం ఇవ్వండి. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులను ప్రాక్టీస్ చేయండి.