31 August Deadlin: నెలాఖరు లోపు ఈ పనులు తప్పక చేయండి.. లేకపోతే ఈ నష్టం తప్పదు!
31 August Deadlin: ఆగస్ట్ నెల ముగుస్తోంది. ఈ నెలాఖరులోపు కొన్ని ఆర్థిక వ్వవహరాలను సంబందించిన KYCని పూర్తి చేశారో? లేదో? చూసుకోండి.
ఆగస్ట్ నెల ముగియబోతోంది. ఈ నెలాఖరులోపు, కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్వవహరాలను పూర్తి చేశారో? లేదో? చెక్ చేసుకోండి. లేకపోతే భవిష్యత్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వ్యవహారాలేంటో ఓసారి చూద్దాం.
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే, ఈ ఫథకానికి సంబంధించిన KYC చేయడానికి ఆగస్టు 31 వరకే చివరి ఛాన్స్ . దీనితో పాటు, ప్రముఖ PNB( Punjab National Bank) తన ఖాతాదారులకు ముఖ్య సూచన చేసింది. అది చేయడంలో విఫలమైతే మీ ఖాతా డీయాక్టివేట్ చేయనుంది. అదే సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారికి కూడా గడువు ఆగస్టు 31 వరకే . నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన ఈ పనుల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
1. PM కిసాన్ స్కీం KYC
సాధ్యమైనంత త్వరగా PM కిసాన్ స్కీం e-KYCని పూర్తి చేయండి. ఈ పథకం యెుక్క KYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం విధించిన చివరి గడువును తేదీ 31 ఆగస్టు 2022. మీరు e-KYC పూర్తి చేయకపోతే, తదుపరి విడతకు సంబంధించిన నగదును పొందలేరు. KYC పూర్తి చేయడానికి ఇంతకుముందు ప్రభుత్వం విధించిన గడువు 31 జూలై 2022 (PM కిసాన్ స్కీమ్ KYC డెడ్‌లైన్) కాగా ఇప్పుడు దాన్ని 31 ఆగస్టు 2022కి పెంచింది. ఇప్పటివరకు KYC ప్రక్రియను పూర్తి చేయని వారికి స్కీం 11వ విడత ప్రయోజనం అందలేదు. ఈ పథకం యొక్క 12వ విడత విడుదలను సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
2. ఆగస్టు 31లోపు PNB కస్టమర్ KYC
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే, ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేకపోతే, బ్యాంక్ మీ ఖాతాను హోల్డ్‌లో ఉంచుతారు. బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని తెలయజేసింది. ఖాతా సంబంధించిన KYC ప్రక్రియను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయని కస్టమర్‌లు ఆగస్టు 31, 2022లోపు చేయాలి, లేకుంటే మీ ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుంది.
3. ITR వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి
మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే, మీరు దాని వెరిఫికేషన్‌ను నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాలి. అలాగే జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారు దాని వెరిఫికేషన్‌ను కేవలం 30 రోజుల లోపు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. మీరు రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే, మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుంటే, మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు.
సంబంధిత కథనం