Asus ROG STRIX SCAR 17 SE । శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్.. ప్రత్యేక ఎడిషన్!
ఏసస్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. శక్తివంతమైన Asus ROG STRIX SCAR 17 స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్ వివరాలు ఇక్కడ చూడండి.
తైవాన్‌కు చెందిన టెక్ కంపెనీ ASUS తమ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) సిరీస్ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Asus ROG Strix Scar 17 ల్యాప్‌టాప్‌లో Special Editionను విడుదల చేసింది. ఇది పలు ప్రీమియం రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఖరీదైన ల్యాప్‌టాప్. ఇందులో Intel 12th gen Core i9 HX సిరీస్ ప్రాసెసర్, మెరుగైన రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్-పవర్డ్ క్వాడ్ స్పీకర్‌లు మొదలైన టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ల్యాప్‌టాప్ మెటల్ బాడీలో కనిపించని ఇంక్‌తో డైజైన్ చేసిన ఒక ప్రత్యేకమైన ఆర్ట్ వర్క్ దాగి ఉంది. అయితే నేరుగా కనిపించదు. ఎప్పుడైతే ల్యాప్‌టాప్ మెటల్ బాడీపై UV పడుతుందో అప్పుడు ఈ ఆర్ట్ వర్క్ అనేది నీలం, ఆకుపచ్చ రంగులలో కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది.
ROG STRIX SCAR 17 SE గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ధరలు భారత మార్కెట్లో రూ. 3,59,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను ASUS e-shop, Amazon India, Flipkart ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు అలాగే Asus ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎప్పట్నించి లభ్యమవుతుందనే విషయాన్ని ఏసస్ ఇంకా వెల్లడించలేదు.
ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.
ASUS ROG STRIX SCAR 17 SE ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 240Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 17.3 అంగుళాల ఫుల్ Quad HD IPS LCD డిస్‌ప్లే
- 32GB/64GB డ్యూయల్-ఛానల్ RAM, 4TB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఇంటెల్ కోర్ i9-12950HX ప్రాసెసర్
- Windows 11 Pro ఆపరేటింగ్ సిస్టమ్
- 90Whr బ్యాటరీ
మిగతా వివరాలను పరిశీలిస్తే బ్యాక్‌లిట్ కీబోర్డ్, USB 3.2 Gen 1 టైప్ A పోర్ట్‌లు, USB 3.2 Gen 2 Type C పోర్ట్, థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌తో USB Type-C, HDMI 2.1 పోర్ట్, 3.5mm జాక్, Wi-Fi 6E, బ్లూటూత్ ఉన్నాయి.
సంబంధిత కథనం