ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!-army agniveer bharti 2022 registration of army recruitment rally starts from july 1 keep these important documents ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!

HT Telugu Desk HT Telugu

అగ్నివీర్ జవాన్ల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 1, 2022 నుండి ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ తర్వాత, రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

army recruitment 2022

సైన్యంలో 25000 అగ్నివీర్ జవాన్ల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 1, 2022 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్మీలో అగ్నివీర్ సోల్జర్‌గా పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ ని సందర్శించడం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు నెలలో జరిగే రిక్రూట్‌మెంట్ ర్యాలీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తొలి దశలో 25 వేల మంది అగ్నివీర్ జవాన్లను ఆర్మీ ఎంపిక చేయనున్నారు. దీని తర్వాత రెండో దశ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.మొదటి దశలో 25,000 మంది అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్తంగా 80 ర్యాలీలు నిర్వహించనున్నారు.

అప్లై చేసుకోవడానికి Direct Link

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి:

1- 10th లేదా 12th ఉత్తీర్ణత సర్టిఫికేట్

2- NCC లేదా ITI లేదా ఏదైనా ఇతర సాంకేతిక డిప్లొమా సర్టిఫికెట్స్

3- 20 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు ( షాట్ హెయిర్‌తో ఉండాలి)

4- నివాస ధృవీకరణ పత్రం

5- కుల ధృవీకరణ పత్రం

6- మత ధృవీకరణ పత్రం

7 - పాఠశాల క్యారెక్టర్ సర్టిఫికేట్

8- గ్రామ పెద్ద లేదా సర్పంచ్ నుండి జారీ చేయబడిన క్యారెక్టర్ సర్టిఫికేట్

9- ఒకే బ్యాంకు ఖాతా నంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్

10- స్పోర్ట్స్ సర్టిఫికేట్ ( ఉంటే )

11- పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్

12- సర్పంచ్ లేదా మున్సిపల్ సర్వెంట్ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం

సంబంధిత కథనం