Summer Vacation: ఈ దేశాలకు వెళితే పాతికవేల రూపాయలలోపే ఖర్చవుతుంది, వేసవిలో అలా తిరిగి వచ్చేయండి-a summer vacation to these countries costs less than twenty five thousand rupees ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Vacation: ఈ దేశాలకు వెళితే పాతికవేల రూపాయలలోపే ఖర్చవుతుంది, వేసవిలో అలా తిరిగి వచ్చేయండి

Summer Vacation: ఈ దేశాలకు వెళితే పాతికవేల రూపాయలలోపే ఖర్చవుతుంది, వేసవిలో అలా తిరిగి వచ్చేయండి

Haritha Chappa HT Telugu
Mar 14, 2024 01:30 PM IST

Summer Vacation: త్వరలో వేసవి సెలవులు వస్తున్నాయి. సమ్మర్ వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా తక్కువ ఖర్చు అయ్యే దేశాల జాబితా ఇక్కడ ఇచ్చాము.

సమ్మర్ ట్రిప్‌కు ఈ దేశాలు బెస్ట్
సమ్మర్ ట్రిప్‌కు ఈ దేశాలు బెస్ట్ (Pixabay)

Summer Vacation: బయట దేశాలకు సమ్మర్ ట్రిప్ వేస్తే ఎక్కువ ఖర్చయిపోతుందనుకుంటారు ఎంతోమంది. కొన్ని దేశాలకు ప్రయాణం చేస్తే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న బడ్జెట్ లోనే ఇతర దేశాలకు వెళ్లి రావచ్చు. అలాంటి కొన్ని అందమైన దేశాల జాబితా ఇక్కడ ఇచ్చాము. ఈ దేశాలకు వెళితే పాతికవేల రూపాయలలోపే ఖర్చవుతుంది.

థాయిలాండ్

ఎన్నో దేవాలయాలు, సందడిగా ఉండే వీధి మార్కెట్లు, నోరూరించే ఆహారాలు థాయిలాండ్‌లో ఎన్నో ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మీరు అనుకున్న బడ్జెట్ లోనే ఈ దేశానికి వెళ్లి రావచ్చు. ఇది ట్రావెలర్లకు స్వర్గధామం అని చెప్పొచ్చు. పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. బ్యాంకాక్ లో ఉండే రిక్షాల్లాంటి టుక్ టుక్ బండి ఎక్కి వీధులన్నీ తిరగవచ్చు. చావో ఫ్రయా నదిలో బోట్ ట్రిప్పులు వెళ్లవచ్చు.

శ్రీలంక

భారతదేశానికి కొద్ది దూరంలోనే ఉంటుంది శ్రీలంక. అక్కడ పచ్చని తేయాకు తోటలు, సహజమైన బీచ్‌లు, పురాతన శిథిల కట్టడాలు కనువిందు చేస్తూ ఉంటాయి. చరిత్రను, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు శ్రీలంక వెళితే ప్రశాంతంగా ఉంటుంది. విశ్రాంతిని కోరుకునే వారు కూడా శ్రీలంక టూర్ వెళ్తే ఎంతో హాయిగా ఉంటుంది. పురాతన నగరాలు ఎన్నో ఇక్కడ ఉంటాయి. అక్కడ పురాతన నగరాల్లో అనురాధపురం ఒకటి. అక్కడ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. మెరిస్సా బీచ్ లో అలా తిరిగితే ఆ ఆనందమే వేరు.

నేపాల్

దేశానికి మీరు అనుకున్న బడ్జెట్లోనే వెళ్లే మరొక అంతర్జాతీయ ప్రయాణం నేపాల్. హిమాలయాల పక్కన ఉండే ఈ అందమైన దేశం ఇది. కొండ గ్రామాలకు నిలయం నేపాల్. మిమ్మల్ని ఎన్నో విధాలుగా సంతోషపెడుతుంది ఈ దేశం. సుందరమైన మార్గాలు, ట్రెక్కింగ్, ప్రార్ధన దేవాలయాలు, మఠాలు ఇవన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఖాట్మండులోని వీధులు ఎంతో అందంగా స్వాగతం పలుకుతాయి. నేపాల్‌కు కుటుంబంతో సహా వెళ్లండి. మరిచిపోని జ్ఞాపకాలను మూటకట్టుకోండి.

వియత్నాం

పురాతన సంప్రదాయాలు కలిగిన దేశం వియత్నాం. అక్కడ ఉండే కొన్ని నగరాలు ఎంతో సందడిగా ఉంటాయి. వియత్నం వెళ్లడానికి పెద్దగా ఖర్చు కూడా అవదు. ఇక్కడ ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. పురాతన శిథిలాలు చరిత్రను గుర్తుచేస్తాయి. అక్కడ ఉండే మార్కెట్లు కూడా ఎన్నో రకాల ఉత్పత్తులను అమ్ముతూ పర్యాటకలను ఆకర్షిస్తాయి.

సింగపూర్

సింగపూర్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం. మన దేశం నుంచి వెళ్లేందుకు తక్కువ ఖర్చు అవుతుంది. డైరెక్ట్ ఫ్లైట్లు సింగపూర్ కు ఉన్నాయి. కాబట్టి సమయం కూడా వేస్ట్ అవ్వదు. మెరీనా బే ఫాన్స్, సెంటోసా ద్వీపం ఇవన్నీ ఎంతో అందంగా ఉంటాయి. చైనా టౌన్, లిటిల్ ఇండియా వంటి ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. ఇవి చైనాను, ఇండియాను గుర్తుచేస్తాయి.

మలేషియా

అందమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్ మలేషియా. ఇది మీరు అనుకున్న బడ్జెట్లోనే వెళ్లి రావచ్చు. వీటి ఫ్లైట్ టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయి. ఇక్కడ ఉండే ద్వీపాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఎన్నో వీధులు సందడిగా ఉంటాయి. మార్కెట్లో రోడ్లమీద కొలువుదీరుతాయి. ఎన్నో రకాల వంటకాలు కూడా అక్కడ స్వాగతం పలుకుతూ ఉంటాయి.

Whats_app_banner