Breakfast For Weight Loss : బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చాల్సిన 7 ఆహారాలు ఇవే.. బరువు తగ్గొచ్చు-7 foods to include in breakfast for weight loss heres list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast For Weight Loss : బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చాల్సిన 7 ఆహారాలు ఇవే.. బరువు తగ్గొచ్చు

Breakfast For Weight Loss : బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చాల్సిన 7 ఆహారాలు ఇవే.. బరువు తగ్గొచ్చు

Anand Sai HT Telugu
Nov 19, 2023 06:30 AM IST

Breakfast Ideas : ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. రోజంతా యాక్టివ్‍గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అయితే కొన్ని ఆహారాలను చేర్చుకుంటే ఇంకా మంచిది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. అల్పాహారంలో పౌష్టికాహారం పుష్కలంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకొంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ఆహారాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఆ ఆహారాలు ఏమిటి?

గుడ్డులో ప్రొటీన్లు ఉండటం వల్ల బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్. గుడ్లు తినడం వల్ల అధిక ఆకలి తగ్గుతుంది. ఉదయం ఎగ్ తీసుకుంటే ప్రోటిన్లు దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లోకి గుడ్లను తీసుకుంటారు. బలంగా ఉంటారు.

పీచు, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చియా సీడ్స్ అల్పాహారానికి బాగా ఉపయోగపడతాయి. చియా విత్తనాలను నీటిలో నానబెట్టవచ్చు. చియా గింజలను స్మూతీతో లేదా లేకుండా అల్పాహారంగా తినవచ్చు. చియా గింజలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు.

వోట్మీల్ కొలెస్ట్రాల్ తగ్గించే అల్పాహారంగా పరిగణించబడుతుంది. వోట్మీల్ ఆకలిని తగ్గిస్తుంది, శక్తిని అందిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట వోట్మీల్ తీసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీవితం కోసం అవోకాడోస్ అల్పాహారంలోకి చేర్చుకోండి. ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. రోజంతా ఆకలి బాధలను నివారించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి చాలా మంచిది. ఉదయం పూట యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.

మొలకెత్తిన బీన్ సలాడ్ రుచికరమైనది మాత్రమే కాదు, ఫైబర్, ప్రోటీన్లకు మంచి మార్గం. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. త్వరగా ఆకలి కూడా వేయదు. బరువు తగ్గాలనుకునేవారు.. దీనిని తీసుకోవచ్చు.

బాదంలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. హృదయ సంబంధ వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది ఇది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాదం కూడా సహాయపడుతుంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి బాదం చేర్చుకోండి.

ఉదయం అల్పాహారం ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. దీని ద్వారా చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఏది పడితే అది తినకుండా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మార్నింగ్ మనం తీసుకునే ఆహారం.. రోజులో మీ మూడ్‍ను డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవాలి.

Whats_app_banner