2022 TVS Ronin | నియో-రెట్రో శైలి డిజైన్‌తో వచ్చిన సరికొత్త మోటార్‌సైకిల్!
TVS మోటార్ కంపెనీ సరికొత్తగా TVS Ronin అనే స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ బైక్ ధర, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తమ బ్రాండ్ మీద TVS Ronin అనే పేరుతో ఒక సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. TVS Ronin మొత్తంగా 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్‌లో లైట్నింగ్ బ్లాక్, మాగ్మా రెడ్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి, అయితే బేస్ ప్లస్ వేరియంట్‌లో డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్ షేడ్స్ కలర్లలో లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్ బైక్ గెలాక్సీ గ్రే, డాన్ ఆరెంజ్ రంగులలో లభిస్తుంది.
TVS Roninలో పూర్తిగా LED లైట్లను ఇచ్చారు. ఇది Apache RTR 200 4V బైక్‌కు సమానమైన 20hp పవర్ కలిగిన 225.9cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ సరికొత్త బైక్ తో పాటు టీవీఎస్ కంపెనీ రైడింగ్ గేర్ రూపంలో రోనిన్-బ్రాండెడ్ వస్తువులను కూడా అందిస్తోంది. ఇంకా ఈ కొత్త బైక్ లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఈ కింద తెలుసుకోండి.
TVS Roninలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ కొత్త TVS రోనిన్ బైక్ డిజైన్ పరంగా రెట్రో-శైలి, స్క్రాంబ్లర్-కమ్-కేఫ్ రేసర్ మోటార్‌సైకిల్ ఆకారాన్ని తీసుకుంటుంది. ముందు వైపు T-షేప్ LED DRLతో రౌండ్ హెడ్‌లైట్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. అలాగే టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సీటు, ఎండ్-క్యాన్‌పై సిల్వర్-కలర్ టిప్‌తో ఆల్-బ్లాక్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ విషయంలో వినియోగదారులు తమ అభిరుచులకు తగినట్లుగా కొన్ని చోట్ల కస్టమైజేషన్ చేసుకునే వెసులుబాటు కూడా కంపెనీ కల్పిస్తోంది.
TVS Ronin ఫీచర్లను పరిశీలిస్తే USB ఛార్జర్ , TVS స్మార్ట్ Xonnect బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ ఉన్నాయి. ఇది కాల్ లేదా మెసేజ్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ , వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్‌లను అందిస్తుంది. అలాగే ABS కోసం అర్బన్, రెయిన్ రెండు మోడ్‌లను కలిగి ఉంది.
ఇంజన్ సామర్థ్యం
TVS రోనిన్‌లో 225.9cc 4-వాల్వ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ అమర్చారు. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ కనెక్ట్ చేశారు. అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. దీని ఇంజన్ 7750rpm వద్ద 20.4hp అలాగే 3750rpm వద్ద 19.93Nm శక్తిని విడుదల చేస్తుంది. అదే సమయంలో ఇంజన్‌లో ఆయిల్ కూలర్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉన్నాయి.
ఎక్స్- షోరూమ్ వద్ద రోనిన్ SS - సింగిల్ ఛానల్ ABS ధర, రూ. 1,49,000/-, రోనిన్ DS - సింగిల్ ఛానల్ ABS ధర, రూ. 1,56,500/- అలాగే రోనిన్ TD - డ్యూయల్ ఛానల్ ABS ధర, రూ. 1,68,750/- మొత్తం మూడు వేరియంట్లలో డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
ఈ సరికొత్త బైక్ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్‌నెస్ సిబి350, బజాజ్ పల్సర్ 250, డొమినార్ 250 వంటి బైక్‌లతో పోటీగా ఉంటుంది.
సంబంధిత కథనం