2022 Maruti Suzuki Alto K10 । మరింత పెద్దగా రాబోతున్న మారుతి ఆల్టో, వివరాలు లీక్-2022 maruti suzuki alto k10 is all set to launch variants leaked ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2022 Maruti Suzuki Alto K10 । మరింత పెద్దగా రాబోతున్న మారుతి ఆల్టో, వివరాలు లీక్

2022 Maruti Suzuki Alto K10 । మరింత పెద్దగా రాబోతున్న మారుతి ఆల్టో, వివరాలు లీక్

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 03:07 PM IST

మారుతి సుజుకి తమ మినీ హ్యాచ్‌బ్యాక్ లిస్టును అప్ డేట్ చేయనుంది. త్వరలోనే సరికొత్త మారుతి ఆల్టో, మారుతి K10 కార్లను విడుదల చేస్తుంది. వీటి స్పెసిఫికేషన్లు ఏమి, ధరలు ఎంత తదితర విషయాలను తెలుసుకోండి.

<p>2022 Maruti Alto K10</p>
2022 Maruti Alto K10 (HT Photo)

భారతీయ మార్కెట్లో ఎంట్రీలెవెల్ కార్లు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మారుతి కార్. చిన్న సైజ్ హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ పెరగటంతో హ్యుందాయ్ నుంచి శాంత్రో, ఇయాన్.. ఆ తర్వాత నిస్సాన్ డాట్సన్ బ్రాండ్‌పై గో, గో+, రెడి గో వచ్చాయి. అనంతరం రెనాల్ట్ క్విడ్ రాకతో మార్కెట్లో పోటీ మరింత పెరిగింది. తదనంతర కాలంలో ఈ సెగ్మెంట్ నుంచి అన్నీ బ్రాండ్ లలో కార్ల ఉత్పత్తి నిలిచిపోయాయి. ఇప్పుడు రెనాల్ట్ క్విడ్, కైగర్ అలాగే మారుతి నుంచి ఆల్టో, వ్యాగన్ఆర్ వంటి కార్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ, దేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయిస్తున్న అతిపెద్ద కంపెనీ మారుతి. ఈ బ్రాండ్ నుంచి ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ ఉన్నాయి. ఇప్పుడు మారుతి ఫ్యామిలీలోకి మరో కొత్త మోడల్ చేరనుంది. ఇందులో భాగంగా మారుతి ఆల్టో 800 అలాగే ఆల్టో కె10లను విడుదల చేయడానికి ఆటోమొబైల్ సంస్థ సిద్ధంగా ఉంది. 2022 మారుతి ఆల్టోను ఈ ఆగష్టు 18న మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

సరికొత్త ఆల్టో పాత మోడల్ కంటే పరిమాణంలో మరింత పెద్దది, బోల్డ్, ఆకర్షణీయంగా ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇక ఆల్టో K10 లోని అన్ని వేరియంట్‌ల వివరాలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.

మారుతి ఆల్టో K10 వేరియంట్‌లు

నివేదికలు వెల్లడించిన ప్రకారం మారుతి ఆల్టో K10 STD, LXi, VXi , VXi + వేరియంట్‌లలో రాబోతుంది. వీటన్నింటిలో ఆప్షనల్ (O) వేరియంట్‌ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (AGS)లో 3 వేరియంట్‌లు ఉండనున్నాయి. మొత్తంగా 11 వేరియంట్లలో ఈ హ్యాచ్‌బ్యాక్ రాబోతుంది. 2022 మారుతి ఆల్టో కె10లోని అన్ని వేరియంట్‌ల వివరాలు ఈ కింద చూడవచ్చు.

1. మారుతి ఆల్టో K10 STD 1L 5MT

2. మారుతి ఆల్టో K10 LXi 1L 5MT

3. మారుతి ఆల్టో K10 LXi (O) 1L 5MT

4. మారుతి ఆల్టో K10 VXi 1L 5MT

5. మారుతి ఆల్టో K10 VXi (O) 1L 5MT

6. మారుతి ఆల్టో K10 VXi+ 1L 5MT

7. మారుతి ఆల్టో K10 VXi+ (O) 1L 5MT

8. మారుతి ఆల్టో K10 VXi 1L AGS

9. మారుతి ఆల్టో K10 VXi 1L (O) AGS

10. మారుతి ఆల్టో K10 VXi+ 1L AGS

11. మారుతి ఆల్టో K10 VXi+ 1L (O) AGS

ఆల్టో కె10 ఇంజన్ కెపాసిటీ

పైన జాబితాను గమనిస్తే 2022 మారుతి ఆల్టో కె10లోని అన్ని వేరియంట్‌లు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతాయి.

కొత ఆల్టో K10లో 998cc సామర్థ్యం గల ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5,500 RPM వద్ద 66 bhp శక్తిని అలాగే 3,500 RPM వద్ద 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AGS (AMT) ఎంపికతో కొనుగోలు చేయవచ్చు.

కొత్త ఆల్టో K10 3,530mm పొడవు, 1,490mm వెడల్పు, 1,520mm ఎత్తు అలాగే 2,380mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీని బరువు కూడా 1,150 కిలోలు. 2022 మారుతి ఆల్టో ధరలు లాంచ్ రోజున అధికారికంగ తెలుస్తాయి. ఎక్స్-షోరూమ్ వద్ద ధర సుమారు రూ. 3.50 లక్షలుగా ఉండవచ్చునని అంచనా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం