OTT Romantic Movie: ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
OTT Romantic Drama: ఛాలెంజర్స్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సుమారు ఐదు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ హాలీవుడ్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ రొమాంటిక్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో చాలా హాలీవుడ్ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మంచి క్రేజ్ కనిపిస్తుండటంతో డబ్బింగ్ వెర్షన్‍లు కూడా అడుగుపెడుతున్నాయి. తాజాగా హాలీవుడ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఛాలెంజర్స్ ఓటీటీలోకి వచ్చేసింది. హాలీవుడ్ పాపులర్ నటి, డ్యూన్ చిత్రంతో మరింత ఫేమస్ అయిన జెండాయా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
స్ట్రీమింగ్ ఎక్కడ?
ఛాలెంజర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి నేడు (అక్టోబర్ 1) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఏప్రిల్ 26వ తేదీన థియేటర్ల ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు సుమారు ఐదు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
తెలుగులోనూ.. మొత్తంగా 21 భాషల్లో..
అమెరికన్ మూవీ అయిన ఛాలెంజర్స్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏకంగా 21 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. స్పానిష్, పోర్చుగీస్, చైనీస్ సహా మరిన్ని విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా 21 భాషల ఆడియోలో ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఛాలెంజర్స్ చిత్రానికి లుకా గువాడగ్నినో దర్శకత్వం వహించారు. టెన్నిస్ గేమ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో జెండాయాతో పాటు జోస్ ఓ కొన్నోర్, మైక్ ఫైస్ట్ ముఖ్యమైన పాత్రలు చేశారు. డర్నెల్ అప్‍లింగ్, షేన్ హారిస్, నాడా డాస్పోటోవిచ్, ఏజే లిస్టర్, నాహీమ్ గ్రేసియా కీరోల్స్ చేశారు.
ఛాలెంజర్స్ స్టోరీలైన్
పాపులర్ టెన్నిస్ ప్లేయర్ తాషి (జెండాయా) కోచ్‍గా మారి తన భర్త ఆర్ట్ డోనాల్డ్ సన్ (మైక్ ఫైస్ట్)ను ఛాంపియన్ ఆటగాడిగా తీర్చిదిద్దుతుంది. అయితే, ఓ దశలో అతడు వరుసగా ఓడిపోతాడు. ఈ క్రమంలో తాషి మాజీ బాయ్‍ఫ్రెండ్, తన మాజీ స్నేహితుడు ప్యాట్రిక్ మళ్లీ వారి జీవితాల్లోకి వస్తాడు. ఒకప్పుడు అతడు కూడా తాషిని ప్రేమించి ఉంటారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి.. పరిస్థితులు ఎలా మారాయనే విషయం చుట్టూ ఛాలెంజర్స్ మూవీ సాగుతోంది. టెన్నిస్, ట్రాయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్లతో ఈ చిత్రం సాగుతుంది.
ఛాలెంజర్స్ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‍లో థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 55 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ మూవీ 94.2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది.
మలయాళ మూవీ బోట్ కూడా నేడే..
మలయాళ మూవీ బోట్ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సర్వైవల్ డ్రామా చిత్రంలో స్టార్ కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్ చేశారు. రెండో ప్రపంచయుద్ధం సాగుతున్న 1943 బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో ఈ స్టోరీ సాగుతుంది. బాంబు దాడుల నుంచి తప్పించుకునేందుకు సముద్రంలో బోటులో పది మంది ప్రయాణం చేయడం, వారు సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ ఉంటుంది. బోట్ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి చెంబు దేవన్ దర్శకత్వం వహించారు.