NNS 28th May Episode: మిస్సమ్మ మల్లెపూలను చూసి డిస్టర్బ్ అయిన అమర్.. పిల్లల గదిలో అరుంధతిని చూసి షాకైన భాగీ!
NNS 28th May Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మే 28) ఎపిసోడ్లో మిస్సమ్మను చూసి డిస్టర్బ్ అవుతాడు అమర్. మరోవైపు పిల్లల గదిలో అరుంధతిని చూసి భాగీ షాకవుతుంది.
NNS 28th May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మే 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. భాగీలో అరుంధతిని చూసిన అమర్ తాను తెచ్చిన మల్లెపూలను ఆమె తలలో పెడతాడు. అది చూసి కోపంతో తలుపు వేసుకుంటుంది మనోహరి. అరుంధతి కూడా చూడలేక అటువైపు తిరుగుతుంది.
గుప్తగారు నిజంగానే మా ఆయన భాగీకి పూలు పెట్టాడా అని అడుగుతుంది. పెట్టాడు అని గుప్త చెప్పగానే నేను అనుకుని పెట్టారు లేదంటే మా ఆయన నిజంగా శ్రీరామచంద్రుడే అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అమర్ తలలో పూలు పెట్టగానే అక్కడనుంచి పరిగెత్తుకుంటూ లోపలకు వెళ్తుంది భాగీ. అసలేం జరిగిందో అర్థంకాక షాక్‌లో ఉంటాడు అమర్.
అరుంధతికి అబద్ధం చెప్పి గుప్త
జరిగినదాన్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతుంది మనోహరి. ఈ అక్కాచెల్లెళ్లు కలిసి అమర్‌ను నన్ను వేరు చేస్తున్నారు. అప్పుడు అది.. ఇప్పుడు ఇది.. నా జీవితం నాశనం చేయడానికే వీళ్లిద్దరూ పుట్టినట్టున్నారు. ఎలాగైనా ఈ మిస్సమ్మను కూడా వాళ్ల అక్క దగ్గరకు పంపిస్తే అమర్, నాకు మధ్య అడ్డులేకుండా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి.
పిల్లల దగ్గరకు వెళ్తానని గుప్తకు చెప్పి బయల్దేరిన అరుంధతి.. మనోహరి మాటలు విని ఆగిపోతుంది. ఇకనైనా మారవే మను.. ఈ కుట్రలు, కుతంత్రాలు ఆపేసి మంచిగా బతుకు అని చెబుతుంది. కానీ మనోహరి మాటలు విని ఆశ్చర్యంతో గుప్త దగ్గరకు పరిగెత్తి నిజం చెప్పమంటుంది. మనోహరి చెప్పినదాన్నిబట్టి భాగీ, నేను అక్కాచెల్లెళ్లం అంటే మా నాన్న రామ్మూర్తి.. నిజం కదా అని నిలదీస్తుంది.
కానీ అరుంధతికి నిజం తెలిస్తే ప్రమాదమని గుప్త ఏదో అబద్ధం చెప్పి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు. నిన్ను ఆ బాలిక అక్క అని పిలుస్తుంది కాబట్టి మనోహరి అటుల అని ఉండవచ్చును కదా.. నీ భర్తను పెళ్లి చేసుకున్నందున కూడా అలా అని ఉండొచ్చు అని అంటాడు గుప్త. ఏం అర్థంకాక అయోమయంగా పిల్లల దగ్గరకు వెళ్లి పడుకుంటుంది అరుంధతి.
అమర్‌ని డిస్టర్బ్ చేసిన మల్లెపూలు
భాగీ తలలోని మల్లెపూల వాసనకి అమర్‌కి మెలకువ వస్తుంది. తనని లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ మిస్సమ్మ మంచి నిద్రలో ఉంటుంది. కుంభకర్ణుడి కుటుంబ సభ్యురాలిలా ఎలా పడుకుందో అనుకుంటూ గట్టిగా అరుస్తాడు అమర్. ఆ అరుపుకి ఉలిక్కిపడి నేను మోసం చేయలేదు, ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో తెలియదు అనుకుంటూ లేస్తుంది మిస్సమ్మ.
ఎదురుగా ఉన్న అమర్‌ని చూసి ఉలిక్కిపడి ఏంటీ.. మీరింకా పడుకోలేదు? అని అడుగుతుంది. నువ్వు అలా మల్లెపూలు పెట్టుకుని నా పక్కన పడుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు అంటాడు అమర్. ఇద్దరూ కాసేపు వాదించుకుని చెరోవైపు తిరిగి పడుకుంటారు.
పిల్లల గదిలో అరుంధతి
ఉదయం లేవగానే నిర్మలకి కాఫీ ఇచ్చి పిల్లల్ని లేపడానికి వెళ్తుంది మిస్సమ్మ. పిల్లల బెడ్ పక్కన పడుకుని ఉన్న అరుంధతిని చూసి షాకవుతుంది. వెంటనే అరుంధతిని లేపి ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని అడుగుతుంది. మిస్సమ్మకు నిజం తెలిసిపోతుందని భయపడిన అరుంధతి తల్లిలేని పిల్లలు కదా అని నచ్చజెప్పాలని చూస్తుంది.
కానీ మిస్సమ్మ ప్రశ్నమీద ప్రశ్న వేయడంతో.. మిస్సమ్మ.. ఆగు ముందు నువ్వు కాఫీ తాగు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది అరుంధతి. భాగీ అడ్డు తొలిగించుకోవడానికి మనోహరి ఏం చేయబోతోంది? భాగీకి అరుంధతే అమర్ మొదటి భార్య అనే నిజం తెలియనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 28న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్