Ullasam Movie: అజిత్‌, విక్ర‌మ్ హీరోలు - అమితాబ్ ప్రొడ్యూస‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్ సింగ‌ర్ -తెలుగులో రిలీజైన డిజాస్ట‌ర్ మూవీ-why amitabh bachchan produced ullasam movie starring ajith and vikram became a box office disaster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ullasam Movie: అజిత్‌, విక్ర‌మ్ హీరోలు - అమితాబ్ ప్రొడ్యూస‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్ సింగ‌ర్ -తెలుగులో రిలీజైన డిజాస్ట‌ర్ మూవీ

Ullasam Movie: అజిత్‌, విక్ర‌మ్ హీరోలు - అమితాబ్ ప్రొడ్యూస‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్ సింగ‌ర్ -తెలుగులో రిలీజైన డిజాస్ట‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
Mar 02, 2024 07:53 AM IST

Ullasam Movie: స్టార్ హీరోలు అజిత్, విక్ర‌మ్ హీరోలుగా బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌బ‌చ్చ‌న్ నిర్మించిన ఓ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. తెలుగులోనూ రిలీజైన ఆ సినిమా ఏదో తెలుసా...

ఉల్లాసం మూవీ
ఉల్లాసం మూవీ

Ullasam Movie: క‌థ‌లో బ‌లం లేక‌పోతే స్టార్ వాల్యూ కూడా సినిమాను కాపాడ‌లేదు. ఎంత పెద్ద కాంబినేష‌న్ అయినా క‌థ లేకుండా ప్రేక్ష‌కుల్నిమెప్పించ‌డం క‌ష్ట‌మే. అందుకు ఉదాహ‌ర‌ణం ఉల్లాసం మూవీ. 1997లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

అజిత్‌, విక్ర‌మ్ హీరోలు...

ఉల్లాసం సినిమాలో కోలీవుడ్ స్టార్స్ అజిత్‌, విక్ర‌మ్ హీరోలుగా న‌టించారు. హీరోలుగా వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న టైమ్‌లో అజిత్‌, విక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఈ మూవీ వ‌చ్చింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూవీని అనౌన్స్ చేసి ఆడియెన్స్‌ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశారు. అజిత్‌, విక్ర‌మ్ కాంబినేష‌న్‌ను బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ బిగ్ బీ సెట్ చేశారు. ఈ సినిమాకు అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రొడ్యూస‌ర్‌. స్వీయ నిర్మాణ సంస్థ ఏబీసీఎల్ బ్యాన‌ర్‌పై అమితాబ్‌బ‌చ్చ‌న్ ప్రొడ్యూస్ చేసిన ఫ‌స్ట్ త‌మిళ్ మూవీ ఇది. అమితాబ్ ప్రొడ‌క్ష‌న్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో షూటింగ్ ఆరంభం కోలీవుడ్‌లో ఉల్లాసం సినిమా ఆస‌క్తిని రేకెత్తించింది.

క‌మ‌ల్‌హాస‌న్ సింగర్…

అమితాబ్ బ‌చ్చ‌న్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ఉల్లాసం మూవీ కోసం విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ సింగ‌ర్‌గా అవ‌తారం ఎత్తాడు. సినిమాలో ఓ పాట పాడాడు. గులాబీ ఫేమ్ మ‌హేశ్వ‌రి ఉల్లాసం సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీతోనే ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉల్లాసం సినిమాకు జేడీ జెర్రీ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కార్తిక్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాట‌లు యూత్‌లో పాపుల‌ర్ అయ్యాయి. దాంతో ఉల్లాసం మూవీ థియేట‌ర్ల‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఊహించ‌ని రిజ‌ల్ట్‌...

కానీ ఉల్లాసం సినిమాకు ఊహించ‌ని రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైన రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. నిర్మాత‌గా అమితాబ్‌బ‌చ్చ‌న్‌కు చాలా న‌ష్టాల‌ను మిగిల్చింది. అప్ప‌టికే ప్రొడ్యూస‌ర్‌గా బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో డీలా ప‌డిన ఆయ‌న‌ను ఉల్లాసం మూవీ మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టింది. అదే టైమ్‌లో ప్రేమ‌దేశం, మెరుపు క‌ల‌లు రిలీజ్ కావ‌డంతో ఉల్లాసం సినిమాను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

తెలుగులోనూ రిలీజ్‌...

అజిత్‌, విక్ర‌మ్ కాంబోకు ఉన్న క్రేజ్ కార‌ణంగా అగ్ర నిర్మాత ఏఎమ్ ర‌త్నం ఉల్లాసం సినిమాను అదే పేరుతో తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు వెర్ష‌న్‌లోని పాట‌లు హిట్ట‌య్యాయి. కానీ సినిమా మాత్రం ఆడ‌లేదు. ఇప్ప‌టికీ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అజిత్‌, విక్ర‌మ్ క‌లిసి చేసిన ఏకైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇదే. ఉల్లాసం త‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌లేదు.

తాంగ‌లాన్ ఏప్రిల్ లో…

ప్ర‌స్తుతం అజిత్‌, విక్ర‌మ్ పాన్ ఇండియ‌న్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న తాంగ‌లాన్ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతోంది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చిన్నా ఫేమ్ అరుణ్‌కుమార్‌తో విక్ర‌మ్ మ‌రో మూవీ చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం అజిత్ విదామ‌యూర్చి పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాకు మ‌గిజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నాడు.