O Saathiya Motion Poster: లేడీ డైరెక్టర్ - ప్రొడ్యూసర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సాథియా - మోషన్ పోస్టర్ రిలీజ్
O Saathiya Motion Poster: టాలీవుడ్‌లో లేడీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నది. ఓ సాథియా పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశాడు.
O Saathiya Motion Poster: ఓ సాథియా సినిమా మోషన్ పోస్టర్‌ను ఇటీవల రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశాడు స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. ఓ సాథియా సినిమాకు దివ్య భావన దర్శకత్వం వహిస్తుండగా చందన కట్టా నిర్మిస్తోంది.
ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిస్తి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో చక్కటి స్పందన లభిస్తోంది. ఈ పోస్టర్‌లో రొమాంటిక్ లుక్‌లో హీరోహీరోయిన్లు కనిపిస్తున్నారు. జీ జాంబీ తర్వాత ఆర్యన్ గౌర హీరోగా నటిస్తోన్న రెండో సినిమా ఇది.
నితిన్ హీరోగా నటించిన చిన్నదానా నీ కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మిస్తీ చక్రవర్తి. ఆ తర్వాత బుర్రకథ, కొలంబస్, బాబు బాగా బిజీ సినిమాలు చేసింది. కాగా ఓ సాథియా ఫస్ట్ సింగిల్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇటీవలే ఓ సాథియా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రలు కొత్తగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఓ సాథియా సినిమాకు విన్ను సంగీతాన్ని అందిస్తున్నాడు.
టాపిక్