Weekend OTT Releases: ఈ వీకెండ్ ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కామెడీ షో మిస్ కావద్దు
Weekend OTT Releases: గతవారంలాగే ఇప్పుడు రాబోయేది కూడా లాంగ్ వీకెండే. ఈ వీకెండ్ లో ఓటీటీల్లో టైంపాస్ చేయడానికి ఓ సూపర్ హిట్ మలయాళ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఓ కామెడీ షో రాబోతున్నాయి.
Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు అన్ని రకాల విందు భోజనం అందనుంది. రొమాన్స్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్ రూమ్ డ్రామా.. ఇలా అన్ని జానర్లకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సూపర్ డూపర్ హిట్ మలయాళ మూవీ ప్రేమలు కూడా ఉంది. ఏ మూవీ, ఏ షో ఎందులో చూడాలో ఇక్కడ చూడండి.
వీకెండ్ ఓటీటీ రిలీజెస్
ప్రేమలు - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మలయాళంలో ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు. తెలుగులోనూ రిలీజై మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో అంటే శుక్రవారం (మార్చి 29) నుంచి ప్రేమలు మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూసినా, చూడకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.
ఇన్‌స్పెక్టర్ రిషి - ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. నవీన్ చంద్ర నటించిన ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్ శుక్రవారం (మార్చి 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. హారర్ క్రైమ్, సూపర్ నాచురల్ కథతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. దీనికి డైరెక్టర్ నందిని జె.ఎస్ దర్శకత్వం వహించారు. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్‌పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు.
లూటేరే - హాట్‌స్టార్
గత శుక్రవారం (మార్చి 22) హాట్‌స్టార్ లోకి కొత్తగా షిప్ హైజాకింగ్ కథ నేపథ్యంలో లూటేరే వెబ్ సిరీస్ వచ్చింది. అయితే రెండు ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు గురువారం (మార్చి 28) లూటేరే మూడో ఎపిసోడ్ కూడా వచ్చేసింది. ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. కుదిరితే మూడు ఎపిసోడ్లను చూసేయండి. లేదంటే అన్ని ఎపిసోడ్లు వచ్చిన తర్వాత ఒకేసారి కూడా బింజ్ వాచ్ చేసేయొచ్చు.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో - నెట్‌ఫ్లిక్స్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ మరో సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి నెట్‌ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో పేరుతో అతడు కామెడీ పంచనున్నాడు. ఈ షో శనివారం (మార్చి 30) ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ షో స్ట్రీమింగ్ ఉంటుంది.
పట్నా శుక్లా -డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టండన్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ఈ పట్నా శుక్లా. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి శుక్రవారం (మార్చి 29) రాబోతోంది. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే కథతో పట్నా శుక్లా అలరించనుంది.
సుందరం మాస్టర్ - ఆహా ఓటీటీ
ప్రముఖ కమెడియన్ హర్ష నటించిన కామెడీ మూవీ సుందరం మాస్టర్. ఈ సినిమా గురువారం (మార్చి 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసేయండి.
టాపిక్