Sundaram Master OTT: ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
Sundaram Master OTT Streaming: సుందరం మాస్టర్ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. వైవా హర్ష హీరోగా నటించిన ఈ సినిమా నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ వివరాలివే..
Sundaram Master OTT: కమెడియన్ వైవా హర్ష అలియాజ్ హర్ష చెముడు.. హీరోగా ‘సుందరం మాస్టర్’ చిత్రం వచ్చింది. కమెడియన్‍గా మంచి ఫామ్‍లో ఉన్న హర్ష.. ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీ ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. స్టార్ హీరో రవితేజ నిర్మించడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సుందరం మాస్టర్ మంచి అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే, అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.
స్ట్రీమింగ్ వివరాలు
సుందరం మాస్టర్ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు (మార్చి 28) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ‘మాస్టారు.. మాస్టారు మీ మనసులను గెలవడానికి వచ్చేశారు’ ఆహా ట్వీట్ చేసింది. థియేటర్లలో ఈ మూవీని చాలా మంది మిస్ అవటంతో.. ఓటీటీలో బాగా పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
థియేటర్లలో రిలీజైన నెల తర్వాత సుందరం మాస్టార్ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ కోసం ఆహా కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగానే ప్రమోషన్లను చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఈటీవీ విన్ దక్కించుకుందని ఆరంభంలో సమాచారం బయటికి వచ్చింది. అయితే, చివరికి ఆహా ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైవా హర్షతో పాటు దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం కీలకపాత్రలు పోషించారు. ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్‍డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ఈ మూవీని నిర్మించారు.
ఓ మారుమూల గ్రామంలోని ప్రజలకు ఇంగ్లిష్ నేర్పేందుకు వెళే ఉపాధ్యాయుడి చుట్టూ సుందరం మాస్టర్ కథ తిరుగుతుంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఈ చిత్రం వచ్చిన ప్రతీ విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. హర్ష హీరోగా చేస్తుండటంతో మరింత ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ దక్కింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. కామెడీ బాగానే పండినా.. సాగదీతగా ఉండడం మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..
బయటి ప్రపంచానికి పెద్దగా సంబంధాలు లేని మిర్యాలమిట్ట అనే మారుమూల గ్రామంలో సుందరం మాస్టర్ చిత్రం సాగుతుంది. మిర్యాలమిట్టలోని ప్రజలు తాము ఇంగ్లిష్ నేర్చుకోవాలని అనుకుంటున్నామని ఎమ్మెల్యే (హర్షవర్దన్)కు లేఖరాస్తారు. దీంతో ఆ ఊర్లో విలువైన వస్తువు ఉందనుకొని.. దాన్ని చేజిక్కించుకోవాలని ఎమ్మెల్యే భావిస్తాడు. ఈ గ్రామస్తులకు ఇంగ్లిష్ నేర్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుందరం మాస్టర్ (హర్ష చెముడు)ను పంపుతారు. అయితే, అప్పటికే ఆ గ్రామంలోని వారికి సుందరం కంటే బాగా ఇంగ్లిష్ వచ్చి ఉంటుంది. దీంతో వారు సుందరానికి చావోరేవో లాంటి పరీక్ష పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. సుందరం మాస్టర్‌ను గ్రామస్తులు ఏం చేశారు.. ఈ గ్రామస్తులకు అంతకు ముందే ఇంగ్లిష్ ఎలా వచ్చిందనే అంశాలు ఈచిత్రంలో ప్రధానంగా ఉంటాయి.