Sundaram Master Collection:సుందరం మాస్టర్ ఫస్డ్ డే కలెక్షన్స్ - బాక్సాఫీస్ వద్ద కుమ్మేసిన కమెడియన్ మూవీ
Sundaram Master day 1 Collection: కమెడియన్ వైవా హర్ష హీరోగా రవితేజ ప్రొడ్యూస్ చేసిన సుందరం మాస్టర్ మూవీ తొలిరోజు 2.03 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
Sundaram Master day 1 Collection: మాస్ మహారాజా రవితేజ ప్రొడ్యూస్ చేసిన సుందరం మాస్టర్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. సుందరం మాస్టర్ మూవీకి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 2.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. 90 లక్షలకుపైగా షేర్ వచ్చినట్లు సమాచారం. ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా సుందరం మాస్టర్ నిలిచింది.
ప్రీ రిలీజ్ బిజినెస్...
రవితేజ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావడంతో సుందరం మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు కోట్ల వరకు జరిగినట్లు చెబుతోన్నారు. తొలిరోజు కోటి వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ శుక్రవారం సుందరం మాస్టర్‌తో పాటుగా మరో ఏడు సినిమాలు రిలీజయ్యాయి. భారీ పోటీ కారణంగా వసూళ్లను కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సుందరం మాస్టర్ మూవీతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్‌కుమార్ కుర్రుతో కలిసి రవితేజ సుందరం మాస్టర్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
సుందరం మాస్టర్ కథ ఇదే...
అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరికి ఇంగ్లీష్ టీజర్‌గా వస్తాడు సుందరం మాస్టర్. కానీ ఊరిలోని వారందరూ ఇంగ్లీష్ గడగడ మాట్లాడేస్తూ సుందరం మాస్టారుకే పరీక్ష పెడతారు. ఆ టెస్ట్‌లో ఫెయిలయితే ఉరి తీసి చంపేస్తామని సుందరం మాస్టారును బెదిరిస్తారు. ఆ టెస్ట్‌లో సుందరం మాస్టర్ పాసయ్యాడా? సుందరం మాస్టారును ఇంగ్లీస్ టీచర్‌గా ఆ ఊరికి ఎమ్మెల్యే ఎందుకు పంపించాడు? అడవి మధ్యలో ఉన్న ఆ ఊరివారు స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడటానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
వైవా హర్ష కామెడీ టైమింగ్...
ఈ సినిమాలో సుందరం మాస్టర్‌గా వైవా హర్ష తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. దర్శకుడు రాసుకున్న కథతో పాటు మిర్యాట మెట్ట సెటప్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబాటులోనైనట్లు చెబుతున్నారు.
ఊరు పేరు భైరవకోన...
సుందరం మాస్టర్ సినిమాలో దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటించింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.చిన్న తెలుగులో కమెడియన్‌గా వందకుపైగా సినిమాలు చేశాడు వైవా హర్ష. ఎక్కడికి పోతావు చిన్నవాడా, కలర్ ఫొటో, కార్తికేయ 2, బేబీతో పాటు ఇటీవల రిలీజైన ఊరు పేరు భైరవకోన సినిమాలు హర్షకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రొడ్యూసర్‌గా రవితేజ..
ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాతో కూడిన చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు రవితేజ. చాంగురే బంగారా రాజా, మట్టికుస్తీ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హీరోగా ఇటీవలే ఈగల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ కమర్షియల్‌గా పర్వాలేదనిపించింది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్‌తో రవితేజ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన హిందీ మూవీ రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది.