Action Thriller OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Action Thriller OTT: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన హిట్లర్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంలో థియేటర్లలో రిలీజైన తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానున్నట్లు చెబుతోన్నారు.
Action Thriller OTT: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన హిట్లర్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోంది. హిట్లర్ మూవీలో విజయ్ ఆంటోనీకి జోడీగా రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది.
గౌతమ్ వాసుదేవమీనన్, చరణ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మణిరత్నం శిష్యుడు ధన దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్, పార్ట్ 2లకు ధన చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
దేవర కారణంగా...
హిట్లర్ మూవీని సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అదే రోజు తెలుగులో ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావడంతో హిట్లర్ తెలుగువెర్షన్ పోస్ట్‌పోన్ అయ్యింది.
తమిళ వెర్షన్‌కు డిజాస్టర్ టాక్ రావడంతో నేరుగా ఓటీటీ ద్వారా హిట్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అక్టోబర్ 18 నుంచి తెలుగుతో పాటు తమళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
పొలిటికల్ రివేంజ్ డ్రామా...
పొలిటికల్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు ధన...హిట్లర్ మూవీని తెరకెక్కించాడు. సెల్వ (విజయ్ ఆంటోనీ) ఓ పల్లెటూరి నుంచి చెన్నై సిటీలో అడుగుపెడతాడు. అభి (రియా సుమన్) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అసెంబ్లీ ఎలెక్షన్స్ డేట్ ప్రకటిస్తారు.
అదే టైమ్‌లో మినిస్టర్ మైఖేల్ (చరణ్ రాజ్)మనుషులు ఒక్కొక్కరిగా హత్యకు గురవుతుంటారు. మినిస్టర్‌కు చెందిన కోట్ల రూపాయల బ్లాక్ మనీ మిస్సవుతుంది. ఈ కేసును డిప్యూటీ పోలీస్ కమీషనర్ (గౌతమ్ వాసుదేవమీనన్) ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు.
మినిస్టర్ మనుషులను సెల్వనే హత్య చేస్తున్నాడనే నిజం బయటపడుతుంది. మినిస్టర్‌పై సెల్వ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? మినిస్టర్ దగ్గర నుంచి దోచుకున్న వందల కోట్ల బ్లాక్‌మనీని సెల్వ ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో...
ఈ సినిమాలో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ కనిపించాడు. విజయ్ ఆంటోనీ, గౌతమ్ మీనన్ యాక్టింగ్ బాగున్నా...ఔట్‌డేటెడ్ స్టోరీలైన్ కారణంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.సినిమాలోని ట్విస్ట్‌లు అంతగా వర్కవుట్ కాలేదు.
రెండేళ్లలో ఆరు ఫ్లాప్‌లు...
ఈ ఏడాది రోమియో, తుఫాన్‌తో పాటు హిట్లర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్ ఆంటోనీ. ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను రాబట్టలేకపోయాయి.
రెండేళ్లలో విజయ్ ఆంటోనీ ఏడు సినిమాలు చేయగా...అందులో బిచ్చగాడు 2 మినహా మిగిలిన సినిమాలన్నీ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి.