Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే-vettaiyan day 1 box office collection rajinikanth movie opens at 30 crores in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vettaiyan Day 1box Office Collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

Hari Prasad S HT Telugu
Oct 10, 2024 10:42 PM IST

Vettaiyan day 1box office collection: వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. అయితే రజనీకాంత్ గతేడాది నటించిన జైలర్ మూవీ కంటే ఈ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పాలి.

వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే
వేట్టయన్ తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవే.. జైలర్ కంటే చాలా తక్కువే

Vettaiyan day 1box office collection: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ తొలి రోజు ఇండియాలో మంచి వసూళ్లే రాబట్టింది. నిజానికి రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం, టైటిల్ పై తెలుగు రాష్ట్రాల్లో కాస్త నిరసన వ్యక్తం కావడంతో ఈ సినిమాకు అంత మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించలేదు. కానీ ముందస్తు అంచనాల ప్రకారం.. వేట్టయన్ తొలి రోజు ఇండియాలో రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

వేట్టయన్ తొలి రోజు బాక్సాఫీస్

ప్రముఖ వెబ్ సైట్ Sacnilk.com ముందస్తు అంచనాల ప్రకారం రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ తొలి రోజు ఇండియాలో రూ.30 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. వీటిలో ఊహించినట్లే తమిళంలోనే అత్యధికంగా రూ.26.15 కోట్లు రాగా.. తెలుగులో రూ.3.2 కోట్లు, హిందీలో రూ.0.6 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు వచ్చాయి.

గతేడాది రజనీ నటించిన జైలర్ మూవీ రూ.48 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. వేట్టయన్ దానికి చాలా దూరంలో నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.72 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా వసూళ్లకు అంతకంటే చాలా తక్కువగానే ఉండనున్నాయి.

ఇక వేట్టయన్ తొలి రోజు ఆక్యుపెన్సీ కూడా తక్కువగానే ఉంది. తమిళనాడులో అత్యధికంగా 53.96 శాతంగా ఉండగా.. తెలుగులో 34.15 శాతం, హిందీలో 8.11 శాతం, కన్నడలో 10.79 శాతం మాత్రమే ఉంది. సినిమాకు తొలి షో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో రానున్న రోజుల్లోనూ పెద్దగా వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

వేట్టయన్ ఎలా ఉందంటే?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించిన మూవీ వేట్టయన్. అంటే వేటగాడు అని అర్థం. ఈ మూవీని మిగిలిన భాషల్లోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేయడంతో కాస్త విమర్శలు వచ్చాయి.

ఇక సినిమా విషయానికి వస్తే.. పోలీసులు అనే వారు హంట‌ర్స్‌లా కాకుండా స‌మాజానికి ప్రొటెక్ట‌ర్స్‌గా ఉండాల‌నే సందేశంతో డైరెక్ట‌ర్ టీజే జ్ఞాన‌వేళ్ ఈ క‌థ‌ను రాసుకున్నారు. కొన్నిసార్లు ఆవేశంలో పోలీసులు తీసుకునే నిర్ణ‌యాలు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయ‌న్న‌ది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఆన్‌లైన్ ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్ పేరుతో సొసైటీలో జ‌రుగుతోన్న దోపీడిని సినిమాలో అంత‌ర్లీనంగా ద‌ర్శ‌కుడు చూపించారు.

ర‌జ‌నీ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవ‌న్నీ చూపిస్తూనే క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ అద‌ర‌గొట్టాడు. ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గాఉండేలా హీరో క్యారెక్ట‌ర్‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. ర‌జ‌నీ డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ ఆక‌ట్టుకుంటాయి.

ఫ‌హాద్ ఫాజిల్ త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో రానా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. మంజు వారియ‌ర్‌, రితికా సింగ్‌, రోహిణి, రావుర‌మేష్ ఇలా సినిమాలో చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు క‌నిపిస్తారు. త‌మ అనుభ‌వంతో పాత్ర‌లకు త‌గ్గ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. ర‌జ‌నీకాంత్ ఎలివేష‌న్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంది.

Whats_app_banner