Vettaiyan Review: వేట్టయన్ రివ్యూ - రజనీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించిన మూవీ ఎలా ఉందంటే?
Vettaiyan Review: రజనీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయన్ మూవీ గురువారం రిలీజైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో అమితాబ్‌బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.
Vettaiyan Review: రజనీకాంత్ హీరోగా నటించిన తమిళ మూవీ వేట్టయన్ అదే పేరుతో అక్టోబర్ 10న (గురువారం) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. వేట్టయన్ మూవీ రజనీకాంత్ అభిమానులను మెప్పించిందా? రజనీకాంత్‌కు జ్ఞానవేళ్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడా లేదా అంటే?
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కథ...
అథియన్ (రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పేరుతెచ్చుకుంటాడు. తప్పు చేసిన వాళ్లను పైకి పంపించడమే కరెక్ట్ అన్నది అథియన్ సిద్ధాంతం. శరణ్య (దుషారా విజయన్) అనే స్కూల్ టీచర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గంజాయి ముఠా నాయకుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు అథియన్. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్యను గుర్తు తెలియని వ్యక్తి రేప్ చేసి చంపేస్తారు.
కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ఎస్‌పీ హరీష్‌కుమార్ (కిషోర్) ఏఎస్‌పీ రూపా(రితికాసింగ్)లతో ఓ సిట్ టీమ్‌ను ఏర్పాటుచేశారు. కానీ వారు నిందితుడిని పట్టుకోవడంలో విఫలమవుతారు. ఈ కేసులోకి ఎంటర్ అయిన అథియన్... గుణ అనే యువకుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు.
అథియన్ చేసిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సత్యదేవ్ పాండే (అమితాబ్‌బచ్చన్) ఆధ్వర్యంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటుచేస్తారు. విచారణ కమిటీ ఏం తేల్చింది? అథియన్ చేసిన ఎన్‌కౌంటర్ సరైందేనా? అథియన్ సిద్ధాంతాన్ని సత్యదేవ్ ఎందుకు వ్యతిరేకించాడు? శరణ్య మర్డర్ కేసులోకి ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్(రానా దగ్గుబాటి), ఎలా వచ్చారు అన్నదే వేట్టయన్ మూవీ కథ.
రజనీ ఇమేజ్‌కు భిన్నంగా...
కమర్షియల్ సినిమాకు మారుపేరుగా నిలుస్తూ వస్తోన్నారు రజనీకాంత్. గత కొన్నాళ్లుగా కథ కంటే తనకున్న మాస్ ఇమేజ్‌ను చాటిచెప్పే హీరోయిజం, ఎలివేషన్లు, స్వాగ్, మేరిజమ్స్‌తో కూడిన సినిమాలే ఎక్కువగా చేస్తోన్నారు రజనీకాంత్. వాటితోనే విజయాల్ని అందుకునే ప్రయత్నాలు చేశారు. అందుకే జైలర్ మినహా మిగిలిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. వేట్టయన్‌తో ట్రాక్ మార్చాడు. సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా చేశాడు రజనీకాంత్.
హంటర్స్ కాదు ప్రొటెక్టర్స్...
వేట్టయన్ పోలీసులు అనే వారు హంటర్స్‌లా కాకుండా సమాజానికి ప్రొటెక్టర్స్‌గా ఉండాలనే సందేశంతో డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ ఈ కథను రాసుకున్నారు. కొన్నిసార్లు ఆవేశంలో పోలీసులు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరుతో సొసైటీలో జరుగుతోన్న దోపీడిని సినిమాలో అంతర్లీనంగా దర్శకుడు చూపించారు.
రజనీ ఫ్యాన్స్‌కు ట్రీట్...
రజనీ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ చూపిస్తూనే క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. గంజాయి ముఠాను అరికట్టే ఎపిసోడ్స్‌లో రజనీ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడానికే ఆ సీన్స్ పెట్టినట్లుగా ఉంటాయి. శరణ మర్డర్ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తప్పు చేసిన వాడిని ఎన్‌కౌంటర్‌లో లేపేయడం సరైందేనని నమ్మే పోలీస్‌కు, నేరస్తులకు న్యాయబద్ధంగానే శిక్షపడాలని నమ్మే న్యాయమూర్తి మధ్య సంఘర్షణ చుట్టూ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
మైండ్‌కు పదును పెట్టే ట్విస్ట్‌లు...
సెకండాఫ్ కథలో వేగం తగ్గడంతో బోర్ కొట్టిన అనుభూతిని కలిగిస్తుంది. ఆడియెన్స్ మైండ్‌కు పదునుపెట్టే మలుపులేవి సినిమాలు కనిపించవు. క్లైమాక్స్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది.
స్టైలిష్‌గా రజనీకాంత్...
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీకాంత్ అదరగొట్టాడు. ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గాఉండేలా హీరో క్యారెక్టర్‌ను రాసుకున్నాడు డైరెక్టర్. రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయి. సత్యదేవ్‌గా పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు అమితాబ్‌బచ్చన్. ఇద్దరు స్క్రీన్‌పై కనిపించే సీన్స్ విజిల్స్ వేయిస్తాయి.
ఫహాద్ ఫాజిల్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో రానా తన నటనతో ఆకట్టుకున్నాడు. మంజు వారియర్, రితికా సింగ్, రోహిణి, రావురమేష్ ఇలా సినిమాలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. తమ అనుభవంతో పాత్రలకు తగ్గ నటనను కనబరిచారు. రజనీకాంత్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...
వేట్టయన్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. రజనీకాంత్ అభిమానులను మెప్పిస్తూనే ఆలోచింపజేస్తుంది.
రేటింగ్: 3/5