Rajinikanth Vettaiyan: రజనీకాంత్ మూవీ తెలుగు టైటిల్ వివాదంపై రానా తండ్రి క్లారిటీ.. చిన్న చూపు ఉండేదంటూ కామెంట్స్
Producer Suresh Babu Clarity On Rajinikanth Vettaiyan Title: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వేట్టయన్ ది హంటర్ తెలుగు టైటిల్‌పై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత, రానా దగ్గుబాటి తండ్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ విషయంపై రానా దగ్గుబాటి కామెంట్స్ చేశాడు.
Rana Daggubati About Rajinikanth Vettaiyan Title: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న అంటే ఇవాళ రిలీజ్ కానుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు.
క్రియేట్ కానీ బజ్
సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు వేట్టయన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. అయితే, వేట్టయన్ సినిమాకు తెలుగులో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అందుకు కారణం వేట్టయన్ అని తమిళ టైటిలే తెలుగులో ఉండటమని చెబుతున్నారు.
తెలుగులోనే తమిళ టైటిల్స్
తెలుగు వారికి తమిళ టైటిల్ అర్థం కాకపోవడం, తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు అలాగే ఉంచుతున్నారని కామెంట్స్ వినిపించాయి. ఇలా వేట్టయన్ తెలుగు టైటిల్‌పై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 9) నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత సురేష్ బాబు, రానా దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు.
మెయిన్ టైటిల్ ఇదే
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. "వేట్టయన్ ది హంటర్ సినిమాను నేను, ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీ మెయిన్ టైటిల్ ది హంటర్. అన్ని భాషల్లోనూ వేట్టయన్ ది హంటర్ అని రిలీజ్ చేస్తున్నారు. హంటర్ అనేదే ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్" అని అన్నారు.
అన్ని భాషల్లోకి
"ఈ చిత్రంలో రజినీకాంత్ గారు, అమితాబ్ గారు, ఫాహద్ గారు, రానా, మంజు వారియర్ ఇలా భారీ తారాగణం కనిపిస్తుంది. టి.జె. జ్ఞానవేల్ సెన్సిబుల్ డైరెక్టర్. ఇందులో రజినీకాంత్ కొత్తగా కనిపిస్తారని అనిరుధ్ కూడా చెబుతున్నారు. డబ్బింగ్ చిత్రాలంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని చిత్రాలు అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. మనం అన్ని భాషల చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నాం" అని సురేష్ బాబు తెలిపారు.
అందుకే మల్టీ స్టారర్ సినిమాలు
"అందరూ సినిమాలను థియేటర్‌లకు వచ్చి చూడాలనే అనుకుంటున్నాం. మన తెలుగు చిత్రాలు అయితే అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. బెంగాలీ వాళ్లు కూడా డబ్బింగ్ కావాలని అడుగుతున్నారు. ఇలా డబ్బింగ్ చిత్రాలు రావడం వల్ల లోకల్ టాలెంట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరికీ పరోక్షంగా పనులు కూడా దొరుకుతాయి. ఎక్కువ మంది జనాలు చూడాలనే మేకర్స్ మల్టీ స్టారర్లు చేస్తున్నారు" అని సురేష్ బాబు పేర్కొన్నారు.
ఓటీటీల్లో ఉండదు
"ఇప్పుడు సినిమా చూడాలంటే చాలా మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, థియేటర్లలో అందరం కలిసి చూస్తాం. ఆ ఫీలింగ్ ఓటీటీల్లో రాదు. సినిమా కల్చర్, థియేటర్ కల్చర్‌ను కాపాడాలి. వేట్టయన్ మూవీని థియేటర్లో చూడండి. అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది" అని సురేష్ బాబు చెప్పారు.
చాలా భిన్నంగా
"సినిమా అనే దానికి భాష లేదు.. హద్దుల్లేవు. కథను బట్టి ఆ చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు రజినీకాంత్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్ చాలా భిన్నంగా ఉంటుంది" అని రానా దగ్గుబాటి తెలిపాడు.
టాపిక్