Matka Twitter Review: మట్కా ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ మాస్ జాతర - మెగా హీరో మూవీకి డివైడ్ టాక్
Matka Twitter Review: వరుణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మట్కా మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నోరా ఫతేహి మరో హీరోయిన్‌గా నటించింది. మట్కా మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటి? సినిమా హిట్టా? ఫట్టా అంటే?
Matka Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. కొన్నాళ్లు సరైన హిట్టులేని వరుణ్‌తేజ్ మట్కాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా? ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
యాక్టింగ్ పరంగా...
మట్కా మూవీలో మట్కా వాసుగా మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వరుణ్‌తేజ్ యాక్టింగ్ బాగుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడని అంటున్నారు.
వరుణ్ తేజ్ కెరీర్‌లో యాక్టింగ్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మట్కా నిలుస్తుందని చెబుతోన్నారు. యాక్షన్ సీన్స్, హీరో క్యారెక్టర్‌కు సంబంధించిన ఎలివేషన్స్, డైలాగ్స్ బాగున్నాయని కామెంట్స్ చెస్తోన్నారు. సినిమా మొత్తం మాస్ జాతరలా ఉంటుందని, వరుణ్‌తేజ్ కటౌట్‌కు ఇలాంటి మాస్ కథలే బెస్ట్ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
ఊహలకు అందే ట్విస్ట్‌లు
బర్మా నుంచి వైజాగ్‌కు బతుకుతెరువు కోసం వచ్చిన ఓ సాధారణ వలసకారుడు మట్కా కింగ్‌గా ఎలా అయ్యాడు? ఈ జర్నీలో అతడి సాగించిన పోరాటంతో ఎమోషన్స్, యాక్షన్, లవ్ స్టోరీ మిక్స్ చేస్తూ దర్శకుడు కరుణకుమార్ మట్కా మూవీని తెరకెక్కించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
కాన్సెప్ట్ బాగున్నా తాను అనుకున్న కథను డైరెక్టర్ పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయలేకపోయాడనే చెబుతోన్నారు. స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉండటం, ట్విస్ట్‌లు మొత్తం ప్రెడిక్టబుల్‌గా సాగడం సినిమాకు మైనస్ అయ్యిందని అంటున్నారు.
బిగ్గెస్ట్ మైనస్...
హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి పాత్రలకు సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదని, కేవలం పాటలు, కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, సత్యం రాజేష్‌లకు మంచి పాత్రలు దక్కాయని చెబుతున్నారు.
మట్కా మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్ అని చెబుతోన్నారు. పాటలు మొత్తం కథకు స్పీడ్ బ్రేకర్స్‌లా అడ్డు తగులుతూనే ఉంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.