Varun Lavanya Wedding: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డ్రెస్‍లు ఎవరు డిజైన్ చేశారంటే!-varun tej lavanya tripathi set to wear manish malhotra designed outfits on their wedding ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Lavanya Wedding: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డ్రెస్‍లు ఎవరు డిజైన్ చేశారంటే!

Varun Lavanya Wedding: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డ్రెస్‍లు ఎవరు డిజైన్ చేశారంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 27, 2023 04:59 PM IST

Varun Tej - Lavanya Tripathi Wedding Outfits: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో జరగనుంది. ఇప్పటికే వధూవరులు ఇటీలీకి వెళ్లారు.

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ (Instagram)

Varun Tej - Lavanya Tripathi Wedding Outfits: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహానికి సమయం సమీపిస్తోంది. ఈ ఇద్దరి పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో వరుణ్, లావణ్య వివాహం జరగనుంది. మెగా కొణిదెల, అల్లు కుటుంబాల సభ్యులు, త్రిపాఠి కుటుంబం సహా మరికొందరు అతిథుల మధ్య ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వరుణ్, లావణ్య ఇటలీకి చేరుకున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. స్టార్ డిజైనర్ మనీశ్ డిజైన్ చేసిన డ్రెస్‍లను పెళ్లి రోజున వరుణ్, లావణ్య ధరించనున్నారట. సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం బయటికి వచ్చింది.

“ప్రత్యేకమైన రోజు మరింత స్పెషల్‍‍గా ఉండేలా మనీశ్ మల్హోత్రా క్రియేట్ చేసిన వెడ్డింగ్ ఔట్‍ఫిట్‍లను ఆ జంట ఎంపిక చేసుకున్నారు. వారి ఇద్దరి అభిరుచులు, ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉట్టిపడేలా ఈ కస్టమ్ డిజైన్డ్ వెడ్డింగ్ డ్రెస్‍లు ఉన్నాయి. ఈ డ్రెస్‍లపై డిటైలింగ్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ డ్రెస్‍ల కలర్ ప్యాలెట్ రిచ్‍గా, డీప్‍గా ఉంటాయి. త్వరలోనే మీరూ చూస్తారు” అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. అలాగే, ఈ పెళ్లి దుస్తులు సంప్రదాయంతో పాటు ట్రెండీగానూ ఉంటాయని తెలుస్తోంది.

వరుణ్, లావణ్య వివాహం నవంబర్ 1వ తేదీన టస్కానీలో జరగనుంది. అక్టోబర్ 30న కాక్‍టైల్ పార్టీ, 31న మెహందీ, హల్దీ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇటలీలో జరగనున్న ఈ పెళ్లి వేడుకులకు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు హాజరుకానున్నారు. అలాగే, నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‍లోని ఎన్‍ కన్వెన్షన్ సెంటర్లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక సహా చాలా రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ కు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది.

సుమారు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటికానున్నారు. ఈ ఏడాది జూన్‍లో వీరికి ఎంగేజ్‍మెంట్ అయింది. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వరుణ్, లావణ్య ఇద్దరూ కలిసి నటించారు. మిస్టర్ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Whats_app_banner