OTT Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!
Top Malayalam Horror Thriller movies: మలయాళంలో కొన్ని హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా పాపులర్ అయ్యాయి. ఉత్కంఠభరితంగా ఉంటూ ప్రేక్షకులను భయపెట్టి మెప్పించాయి. అలా.. తప్పక చూడాల్సిన ఐదు మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
మలయాళ ఇండస్ట్రీ నుంచి హారర్ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని హారర్ థ్రిల్లర్ చిత్రాలు మంచి హిట్లు సాధించాయి. డిఫరెంట్ నరేషన్‍తో కొన్ని చిత్రాలు ఉత్కంఠతో ఊపేశాయి. ఓటీటీలో చాలా మలయాళ హారర్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అసలు మిస్ కాకూడదు. అలా.. వాటిలో తప్పకుండా చూడాల్సిన ఐదు బెస్ట్ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ఇజ్రా
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఇజ్రా (Ezra) మూవీ 2017 ఫిబ్రవరిలో రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓ పాతకాలం నాటి బాక్స్ కొనుగోలు చేసిన తర్వాత కొత్తగా పెళ్లైన జంట జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. ఆ బాక్స్‌లోని దెయ్యం ఇంట్లో విజృంభిస్తుంది. దాని నుంచి ఎలా బయటపడ్డారనే అయ్యారనే విషయం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇజ్రా మూవీకి జే కే దర్శకత్వం వహించారు. ఇజ్రా సినిమా ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ యూట్యూబ్‍లో కూడా అందుబాటులో ఉంది.
భూతకాలం
భూతకాలం సినిమా 2022లో నేరుగా సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ హారర్ మూవీలో రేవతి, షానే నిగమ్ ప్రధాన పాత్రలు పోషించారు. తల్లీకొడుకులు ఉండే ఇంట్లో జరిగే అనూహ్యమైన పరిణామాలతో ఉత్కంభరితంగా ఈ మూవీ సాగుతుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళంలోనూ సోనీలివ్‍లో భూతకాలం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
భ్రమయుగం
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం సినిమా ఈ ఏడాది 2024 ఫిబ్రరిలో రిలీజై సూపర్ హిట్ సాధించింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రశంసలు దక్కించుకుంది. ఈ హారర్ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. భ్రమయుగం చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో సోనీలివ్‍లో ఉంది.
రోమాంచం
రోమాంచం చిత్రం సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ గతేదాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, సాజిన్ గోపు, సిజు సన్నీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించగా.. జితూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ హారర్ మూవీ రోమాంచం.. ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ చూడొచ్చు.
నీలవెలిచం
హారర్ థ్రిల్లర్ మూవీ ‘నీలవెలిచం’ గతేడాది ఏప్రిల్‍లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో టొవినో థామస్, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, రోషన్ మాథ్యూ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆషిక్ అబూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ భవనంలో మిస్టరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నీలవెలిచం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ‘భార్గవి నిలయం’ పేరుతో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.