Rajendra Prasad Daughter: సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట విషాదం - గుండెపోటుతో కూతురు క‌న్నుమూత‌-tollywood actor rajendra prasad daughter gayatri passes away due to heart attack ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajendra Prasad Daughter: సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట విషాదం - గుండెపోటుతో కూతురు క‌న్నుమూత‌

Rajendra Prasad Daughter: సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట విషాదం - గుండెపోటుతో కూతురు క‌న్నుమూత‌

Rajendra Prasad Daughter: సినీన‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న కూతురు గాయ‌త్రి గుండెపోటుతో క‌న్నుమూసింది. గాయత్రి కూతురు సాయితేజస్విని మహానటి సినిమాలో నటించింది.

రాజేంద్ర‌ప్ర‌సాద్ కూతురు గాయ‌త్రి

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న కూతురు గాయ‌త్రి (38) గుండెపోటుతో శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూసింది. గుండెపోటు రావ‌డంతో కుటుంబ‌స‌భ్యులు గాయ‌త్రిని హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ రాజేంద్ర‌ప్ర‌సాద్ కూతురు గాయ‌త్రి తుదిశ్వాస విడిచింది. గాయత్రి మ‌ర‌ణంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది.

గాయ‌త్రి కూతురు...

గాయ‌త్రి కూతురు సాయితేజ‌స్విని మ‌హాన‌టి సినిమాలో చిన్న‌నాటి కీర్తిసురేష్ పాత్ర‌లో క‌నిపించింది.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఓ కొడుకు బాలాజీ ప్ర‌సాద్‌తో పాటు కూతురు గాయ‌త్రి ఉన్నారు. గాయ‌త్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూతురితో త‌న‌కు చాలా రోజుల పాటు మాట‌లు లేవ‌ని ఓ సినిమా వేడుక‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నాడు.

గాయత్రి టవర్స్…

కుమార్తె గాయత్రి మీద ప్రేమతో విజయవాడ బెంజి సర్కిల్ వద్ద 1980వ దశకంలో రాజేంద్ర ప్రసాద్ గాయత్రి టవర్స్ నిర్మించారు. విజయవాడలో మొదటి కమర్షియల్ కాంప్లెక్స్ లలో గాయ‌త్రి ట‌వ‌ర్స్ ఒక‌టిగా నిలిచింది.

ఇండ‌స్ట్రీకి దూరం...

రాజేంద్ర ప్ర‌సాద్ కొడుకుతో పాటు కూతురు గాయ‌త్రి సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగానే ఉన్నారు. త‌న కొడుకు బాలాజీ ప్ర‌సాద్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు. బాలాజీ ప్ర‌సాద్ హీరోగా ఓ సినిమా మొద‌లైంది. కొన్నాళ్లు షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత అనివార్య కార‌ణాల సినిమా ఆగిపోయింది. మ‌ళ్లీ ఇండ‌స్ట్రీవైపు బాలాజీ ప్ర‌సాద్ అడుగులు వేయ‌లేదు.

ఏడేళ్ల క్రితం

రాజేంద్రప్రసాద్ తమ్ముడు గద్దె వీరభద్ర స్వామి ఏడేళ్ళ క్రితం యాక్సిడెంట్లో చని పోయారు. ౌ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీలో పని చేసేవారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో...

సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఫుల్‌బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ క‌ల్కిలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నజ‌న‌క అయితే గ‌న‌క‌, ల‌గ్గం సినిమాలు ఈ నెల‌లోనే రిలీజ్ కాబోతున్నాయి. నితిన్ రాబిన్‌హుడ్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.