Free OTTs in India: అన్‌లిమిటెడ్ ఫన్.. ఈ ఓటీటీలు ఫ్రీగా చూసేయొచ్చు
Free OTTs in India: అన్‌లిమిటెడ్ ఫన్. ఈ ఓటీటీలను ఫ్రీగా చూసేయొచ్చని మీకు తెలుసా? సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా తమ కంటెంట్ ఫ్రీగా అందించే ఓటీటీలు కొన్ని ఉన్నాయి.
Free OTTs in India: ఇప్పుడంతా ఓటీటీ(OTT)ల కాలమని తెలుసు కదా. కరోనా పుణ్యమాని కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే నేరుగా రిలీజ్ అయ్యాయి. వీటికి తోడు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఓటీటీలను చూడాలంటే డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి రావడంతో ఇంకా చాలా మంది వీటికి దూరంగా ఉంటున్నారు. కానీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా కంటెంట్ అందించే ఓటీటీలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీవీఎఫ్ ప్లే (TVF Play)
యువత మెచ్చే ఎన్నో వెబ్ సిరీస్ లను రూపొందించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) ఓటీటీ ప్లాట్‌ఫామ్ తమ రిచ్ కంటెంట్ ను ఫ్రీగా అందిస్తుండటం విశేషం. హిందీ వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూడటానికి మంచి ఓటీటీ ఇది. ఆస్పిరెంట్స్, కోటా ఫ్యాక్టరీ, క్యూబికల్స్, యే మేరీ ఫ్యామిలీ, గుల్లక్, హాఫ్ సీఏ, సందీప్ భయ్యాలాంటి హిట్ వెబ్ సిరీస్ లను ఇందులో ఉచితంగా చూడొచ్చు. TVF Play వెబ్ సైట్లోకి వెళ్లి వీటిని చూసేయండి.
అమెజాన్ మినీ టీవీ (Amazon Mini TV)
అమెజాన్ మినీ టీవీ ఓటీటీలోని కంటెంట్ ను కూడా ఫ్రీగా చూసే వీలుంది. ఇందులో అమెజాన్ ఒరిజినల్స్ తోపాటు టీవీఎఫ్ రూపొందించిన సిరీస్ లు, షార్ట్ వీడియోలు ఉంటాయి. Amazon Mini TV వెబ్ సైట్లోకి వెళ్తే ఎన్నో సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే మధ్యమధ్యలో యాడ్స్ గోల మాత్రం తప్పదు.
ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)
ఇండియాలోని మరో ప్రముఖ ఫ్రీ ఓటీటీ ఎంఎక్స్ ప్లేయర్ (MX Player). ఇందులో పాపులర్ హిందీ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్రీగా చూడొచ్చు. ఇందులో ప్రీమియం మెంబర్ షిప్ కూడా ఉన్నా.. ఫ్రీ కంటెంట్ ను మధ్యలో యాడ్స్ తో చూసే అవకాశం ఉంది. ఈ ఓటీటీలోనూ కొన్ని క్వాలిటీ సిరీస్ ఉన్నాయి.
క్రంచీరోల్ (Crunchyroll)
యానిమేషన్ మూవీస్, వీడియోస్ ఎక్కువగా చూసే వారికి ఈ క్రంచీరోల్ ఓటీటీ ఫ్రీగా ఎంతో కంటెంట్ అందిస్తోంది. డ్రాగన్ బాల్ సూపర్, అటాక్ ఆన్ టైటన్, నారుటో షిప్పుడెన్ లాంటి ఎన్నో పాపులర్ యానిమేషన్ వీడియోలను చూడొచ్చు.
సోనీలివ్ (Sony Liv)
సోనీలివ్ ఓటీటీ కూడా టాప్ కంటెంట్ ను అందిస్తోంది. అయితే చాలా వరకూ వెబ్ సిరీస్ లు, టాప్ మూవీస్ కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఫ్రీగా చూసేందుకు కూడా కొన్ని సినిమాలు, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ ఓటీటీలో 40 వేల గంటలకుపైగా కంటెంట్, 700కుపైగా సినిమాలు ఉన్నాయి. లేటెస్ట్ టీవీ షోలు, స్పోర్ట్స్, ఎంపిక చేసిన సినిమాలను ఫ్రీగా చూడొచ్చు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar)
ప్రముఖ ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ఒకటి. ఇందులో రూ.299, రూ.899, రూ.1499లాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నా కూడా.. పరిమిత సంఖ్యలో సినిమాలు, షోలను ఫ్రీగా కూడా చూసే వీలుంది. మిషన్ మంగళ్, రెయిడ్, అర్జున్ రెడ్డి, తన్హాజీ, విక్రమ్ వేదా, జాలీ ఎల్ఎల్‌బీలాంటి సినిమాలను ఇందులో ఉచితంగా చూడొచ్చు.
జీ5 (Zee5)
జీ నెట్‌వర్క్ కు చెందిన జీ5 ఓటీటీలోనూ మంచి కంటెంట్ ఉంది. ఈ ఓటీటీలోనూ కొన్ని సినిమాలు, షోలను ఫ్రీగా అందుబాటులో ఉంచారు. అయితే చాలా వరకూ ఒరిజినల్స్ ను చూడాలంటే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే.
ఇవే కాకుండా ట్యూబీ టీవీ (Tubi TV), గోకు టీవీ (Goku TV)లాంటి ఓటీటీల్లోనూ బాలీవుడ్ సినిమాలు, సిరీస్ లను ఫ్రీగా చూడొచ్చు.
సంబంధిత కథనం