The Exorcist OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-the exorcist believer movie ott streaming jio cinema streaming this hollywood horror ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Exorcist Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

The Exorcist OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Feb 06, 2024 08:32 PM IST

The Exorcist OTT Streaming: హాలీవుడ్ లో గతేడాది రిలీజై సూపర్ హిట్ అయిన హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఓటీటీలోకి వచ్చేసింది. జియో సినిమాలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ ఓటీటీలోకి వచ్చేసింది
హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ ఓటీటీలోకి వచ్చేసింది

The Exorcist OTT Streaming: హారర్ జానర్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. సూపర్ హిట్ హాలీవుడ్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ జియో సినిమా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం.

yearly horoscope entry point

ది ఎగ్జార్సిస్ట్ ఓటీటీ

ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్ తో వచ్చి వణికించిన మూవీ.. గతేడాది అక్టోబర్ లో ఆరో సీక్వెల్ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీకి కాస్త నెగటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెసైంది.

30 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర 130 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. గతేడాది అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు జియో సినిమాలో ఇండియన్ ఆడియెన్స్ ఈ హారర్ మూవీని చూసే అవకాశం దక్కింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ

ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన అన్ని సినిమాలూ ప్రేక్షకులను భయంతో వణికించాయి. ఈ ఆరో సీక్వెల్ కు డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వం వహించాడు. లెస్లీ ఒడోమ్ జూనియర్, లిడియా జెవెట్, ఒలీవియా ఓనీల్ నటించారు. 1971లో ది ఎగ్జార్సిస్ట్ పేరుతో వచ్చిన నవలను 1973లో తొలిసారి అదే టైటిల్ తో సినిమాగా తెరకెక్కించారు.

ఎగ్జార్సిస్ట్ అంటే భూత వైద్యుడు అని అర్థం. ఈ ఫ్రాంచైజీ నుంచి ఆ తర్వాత 1977లో ఎగ్జార్సిస్ట్ 2: ది హెరెటిక్, 1990లో ది ఎగ్జార్సిస్ట్ 3, 2004లో ఎగ్జార్సిస్ట్: ది బిగినింగ్, 2005లో డొమినియన్: ప్రీక్వెల్ టు ఎగ్జార్సిస్ట్ మూవీస్ వచ్చాయి. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో మరో సీక్వెల్ రిలీజైంది.

జియో సినిమా హాలీవుడ్ హారర్ మూవీస్

జియో సినిమాలో ఈ ఎగ్జార్సిస్టే కాకుండా మరికొన్ని హాలీవుడ్ హారర్ సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 2021లో వచ్చిన ఓల్డ్, ది లాస్ట్ నైట్ ఇన్ సోహో, అనబెల్ కమ్స్ హోమ్, ఎ క్వైట్ ప్లేస్, స్ప్లిట్, నాక్ ఎట్ ద క్యాబిన్, మామా, అజ్, గెట్ ఔట్, ది ఇన్విజిబుల్ మ్యాన్, జాస్ లాంటి హారర్ సినిమాలు కూడా జియో సినిమాలో చూడొచ్చు.

గతేడాది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని ఎన్నో హాలీవుడ్ సినిమాలు జియో సినిమా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఓటీటీని ఫ్రీగా చూడొచ్చు. కొన్ని ఎక్స్‌క్లూజివ్ సినిమాలు చూడాలంటే మాత్రం.. ఏడాదికి రూ.999 చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

Whats_app_banner