Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు షోల మధ్యే వార్-telugu tv shows trp ratings sridevi drama company tops the list etv star maa shows in the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు షోల మధ్యే వార్

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు షోల మధ్యే వార్

Hari Prasad S HT Telugu
Sep 03, 2024 04:29 PM IST

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 34వ వారానికిగాను ఈ రేటింగ్స్ రిలీజ్ కాగా.. వార్ ఆ రెండు ఛానెల్స్ మధ్యే అని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఛానెల్స్ లో వచ్చే రెండు షోల టాప్ స్పాట్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.

తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు షోల మధ్యే వార్
తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు షోల మధ్యే వార్

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోలలో ఏది టాప్? ఏ ఛానెల్లో వచ్చే షో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది? ఈ ప్రశ్నకు టీఆర్పీ రేటింగ్సే సమాధానం ఇస్తాయి. తాజాగా 34వ వారానికి ఈ రేటింగ్స్ రిలీజ్ కాగా.. ఆ రెండు షోలు, ఆ రెండు ఛానెల్స్ మధ్యే పోటీ హోరాహోరీగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. ఇవీ లేటెస్ట్ రేటింగ్స్.

టాప్ టీఆర్పీ షోలు ఇవే

34వ వారం కోసం రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా, ఈటీవీ షోల మధ్య హోరాహోరీగా పోటీ నడిచింది. ఈ లిస్ట్ లో ఈటీవీకి చెందిన షో టాప్ ప్లేస్ కొట్టేయగా.. స్టార్ మా షో తృటిలో మిస్ అయింది. మరి టాప్ 10లో ఉన్న ఆ షోలు ఏవో చూద్దామా?

తాజా టీఆర్పీ రేటింగ్స్ లో ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ లో నటించింది. ఈ షో అర్బర్, రూరల్ కలిపి 4.49 రేటింగ్ సాధించింది. కేవలం అర్బన్ అయితే 4.10గా ఉంది. ఇక రెండో స్థానంలో స్టార్ మా షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం 4.28 రేటింగ్ తో ఉండటం విశేషం. కొద్దిలో ఈ షో టాప్ స్పాట్ మిస్ అయింది.

మూడో స్థానంలోనూ స్టార్ మా ఛానెల్ కే చెందిన కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో ఉంది. ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 4.14 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో ఈటీవీలో వచ్చే ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 నిలిచింది. ఈ షో 3.19 రేటింగ్ సంపాదించింది. తర్వాత ఐదో స్థానంలోనూ ఈటీవీలోనూ వచ్చే జబర్దస్త్ కామెడీ షో 3.14 రేటింగ్ తో ఉంది.

తర్వాతి స్థానాల్లో ఈటీవీలో వచ్చే ఫ్యామిలీ స్టార్స్ (2.94 రేటింగ్), సుమ అడ్డా (2.37), జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ (2.16), ఈటీవీ పాడుతా తీయగా (1.52), ఆడవాళ్లు మీకు జోహార్లు (0.70) ఉన్నాయి.

ఆ రెండు ఛానెల్స్ హవా

మొత్తంగా చూస్తే తెలుగు టీవీ షోలలో పోటీ మొత్తం స్టార్ మా, ఈటీవీ మధ్యే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈటీవీ టాప్ 10లో ఏకంగా ఏడు షోలతో స్టార్ మాపై పైచేయి సాధించింది. రెండు షోలు స్టార్ మాకి చెందినవి ఉన్నాయి. అవి కూడా రెండు, మూడు స్థానాల్లో కావడం విశేషం. జీ తెలుగు నుంచి ఒకే ఒక్క షో టాప్ 10లో స్థానం సంపాదించింది.

సాధారణంగా సీరియల్స్ విషయానికి వస్తే స్టార్ మా, జీ తెలుగు మధ్య ఉండే పోటీ.. షోల విషయంలో మాత్రం స్టార్ మా, ఈటీవీ పోటీ పడుతుంటాయి. ఈ 34వ వారంలోనూ అదే జరిగింది. ఎక్కువ సంఖ్యలో షోలతో ఈటీవీ ఆధిక్యం సాధించింది.

Whats_app_banner