Comedy Web Series: యూట్యూబ్‌లోకి నేరుగా వచ్చేసిన తెలుగు లవ్ కామెడీ సిరీస్- ఫ్యామిలీ మొత్తం చూసేలాంటి కథతో స్ట్రీమింగ్!
Telugu Comedy Web Series Chantabbai In Youtube: నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన లవ్ అండ్ కామెడీ వెబ్ సిరీస్ చంటబ్బాయ్. గోదావరి నుంచి వచ్చే చల్లగాలి లాంటి కథ అంటూ ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఇందులో సూర్య శ్రీనివాస్, రోహిణి రేచల్ హీరో హీరోయన్లుగా నటించారు.
Chantabbai Streaming On Youtube: గోదావరి నేపథ్యంలో వచ్చే కథలకి ప్రేక్షకుల నుంచి ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. అందులోను కుటుంబం మొత్తం కలిసి నవ్వుకుంటూ చూడగలిగే సినిమాలకి మరింత ఆదరణ ఉంది. "చంటబ్బాయ్" అనే సిరీస్ ఆ కోవలోకే వస్తుంది.
బోయ్ ఫార్ములా ఛానెల్
గోదావరి నుంచి వచ్చే చల్లగాలి లాంటి కథగా "చంటబ్బాయ్" వెబ్ సిరీస్ అని మేకర్స్ చెబుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కలసి హాయిగా చూసే సిరీస్ ఇదని అంటున్నారు. ఇటీవలే యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది చంటబ్బాయ్ వెబ్ సిరీస్. యూట్యూబ్‌లో ఎంతో పాపులర్ అయిన ఛాయ్ బిస్కెట్ వాళ్ల బోయ్ ఫార్ములా ఛానల్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది.
అసత్య మూర్తి పుత్రుడు
కాగా "చంటబ్బాయ్" సినిమాలో గోదావరిని అక్కడ మనుషులు వాళ్ల ప్రేమని చాలా అందంగా చిత్రికరించారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే చంటబ్బాయ్ (సూర్య శ్రీనివాస్) తనకున్న అసత్య మూర్తి పుత్రుడు అనే మచ్చని పోగొట్టుకోవడానికి సత్య హరిశ్చంద్రుడులా బతకాలి అనుకుంటాడు. అదే ఉద్దేశంతో తన ప్రేమని కూడా నిజాయితీగా గెలిపించుకోవాలి అనుకుంటాడు.
లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా
కానీ, ఒక అబద్ధం వల్ల తన జీవితం మొత్తం గందరగోళమయం అయిపోతుంది. దాని నుంచి చంటి ఎలా బయటపడ్డాడు అనేది ఈ కథ. చంటబ్బాయ్ వెబ్ సిరీస్ లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సూర్య శ్రీనివాస్, రోహిణి రేచల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
పాత్రలకు తగినట్లుగా
సాంకేతిక విషయాలకి వస్తే డీవోపీగా ప్రసాద్ జి.కే పని తనంకి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. డైరెక్టర్ మెహెర్ యరమాటి తన నటుల్ని పాత్రలకి తగట్టుగా మలుచుకుని ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా చేశారు. కథనాయకుడిగా సూర్య శ్రీనివాస్, హీరోయిన్‌గా రోహిణి రేచల్ అందరి మనసులో నిలిచిపోయే నటనని కనబరిచారని మేకర్స్ తెలిపారు.
కథను మలుపు తిప్పే సీన్‌లో
వారితో పాటు హీరో స్నేహితులుగా గోదావరి పాత్రలో రవి తేజ, మూర్తి పాత్రలో వంశీ, అంజి పాత్రలో అజయ్ కనిపించినంత సేపు నవ్విస్తూ ఆహ్లాద పరుస్తూ ప్రేక్షకుల మెప్పుపొందారు. అలాగే కథానాయకి తండ్రి పాత్ర చేసిన కోటేశ్వర రావు తన నటనతో కథని మలుపు తిప్పే సీన్స్‌లో ప్రేక్షకులని ఆసక్తిగా చూసేలా చేస్తే, హీరో తండ్రి పాత్ర పోషించిన శ్రీనివాస్ తన నటనతో ఆ ఆసక్తిని మరింత పెంచేలా చేశారు.
నేపథ్య సంగీతం మరో బలం
నరేష్ కుమారన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మరొక బలంగా.. ఎడిటర్‌గా చేసిన లోకేష్ చెన్న సిరీస్‌ను ఏ క్షణంలోను బోర్ కొట్టకుండా ఉండేలా చేశారని టాక్ వస్తోంది. యూట్యూబ్‌లో ఎప్పుడు మనం చూసే ఒక సాధారణ వీడియోల కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఓటీటీలో వచ్చే సినిమాలా ఈ చంటబ్బాయ్ ఉందని చెబుతున్నారు. ఈ వీకెండ్ కుటుంబం అంతా కలిసి చూసేందుకు చంటబ్బాయ్ బెస్ట్ ఆప్షన్ అని మేకర్స్ గర్వంగా పేర్కొన్నారు.