Bold Movie In Youtube : 14 ఏళ్లకు తెలుగులో వచ్చిన అమలా పాల్ బోల్డ్ మూవీ- డైరెక్ట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్-ఇలా చూసేయండి!-amala paul tamil bold movie sindhu samaveli telugu version neti charitra released in youtube after 14 years not in ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bold Movie In Youtube : 14 ఏళ్లకు తెలుగులో వచ్చిన అమలా పాల్ బోల్డ్ మూవీ- డైరెక్ట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్-ఇలా చూసేయండి!

Bold Movie In Youtube : 14 ఏళ్లకు తెలుగులో వచ్చిన అమలా పాల్ బోల్డ్ మూవీ- డైరెక్ట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్-ఇలా చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Sep 21, 2024 04:05 PM IST

Amala Paul Bold Movie Neti Charitra In Youtube: డైరెక్ట్ యూట్యూబ్‌లోకి వచ్చేసింది అమలా పాల్ నటించిన తమిళ బోల్డ్ మూవీ నేటి చరిత్ర. తమిళ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సింధు సామవేళి సినిమాను సుమారు 14 ఏళ్లకు నేటి చరిత్ర టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

14 ఏళ్లకు తెలుగులో వచ్చిన అమలా పాల్ బోల్డ్ మూవీ- డైరెక్ట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్-ఇలా చూసేయండి!
14 ఏళ్లకు తెలుగులో వచ్చిన అమలా పాల్ బోల్డ్ మూవీ- డైరెక్ట్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్-ఇలా చూసేయండి!

Neti Charitra Streaming On Youtube: ఓటీటీల హవా పెరగడంతో డిఫరెంట్ కంటెంట్ చూసేందుకు మొగ్గు చూపుతున్నారు సినీ ప్రేక్షకులు. అయితే, హారర్, కామెడీ, బోల్డ్ సినిమాలపై ప్రేక్షకులు దృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే, కొత్త వీకెండ్ వస్తే చాలు సరికొత్త సినిమాలు ఏవి రిలీజ్ అవుతున్నాయని కాచుకుని చూస్తుంటారు.

నీల తామర మూవీతో

ఇదిలా ఉంటే, తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది అమలా పాల్. మలయాళం మూవీ నీల తామరతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటి ఒక్కో ఇండస్ట్రీలో డెబ్యూ చేసుకుంటూ హీరోయిన్‌గా పాపులార్టీ తెచ్చుకుంది. అలా తమిళంలో అమలా పాల్ నటించిన మొదటి సినిమా సింధు సామవేళి.

బోల్డ్ సినిమాతో ఎంట్రీ

సాధారణంగా హీరోయిన్స్ పక్కా కమర్షియల్ సినిమాతోనో.. లేదా లవ్ స్టోరీ మూవీతోనే ఎంట్రీ ఇస్తారు. కానీ, అమలా పాల్ మాత్రం తమింళంలో బోల్డ్ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. తమిళంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సింధు సామవేళి 2010 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మృగం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టిన డైరెక్టర్ స్వామి సింధు సామవేళి చిత్రాన్ని తెరకెక్కించారు.

కుదరని తెలుగు రిలీజ్

అయితే, సింధు సామవేళి సినిమా విడుదలయ్యాకా విపరీతమైన వివాదాస్పదంగా మారింది. దాంతో అమలా పాల్‌పై నెగెటివిటీ రావడమే కాకుండా డైరెక్టర్ స్వామిపై పలు మహిళా సంఘాలు దేహశుద్ధి కూడా చేశారు. అంత కాంట్రవర్సీ తెచ్చిన సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు అప్పట్లోనే డబ్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 10న తెలుగులో విడుదల చేయాలనుకున్న అది కుదరలేదు.

14 ఏళ్ల తర్వాత

ఇప్పుడు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత నేరుగా యూట్యూబ్‌లో దర్శనం ఇచ్చింది సింధు సామవేళి. మూడు నెలల క్రితం నుంచి ఈ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రాన్ని నేటి చరిత్ర అనే టైటిల్‌తో యూట్యూబ్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అమలా పాల్‌తోపాటు హీరో హరీష్ కల్యాణ్ (పార్కింగ్ మూవీ ఫేమ్) కూడా డెబ్యూ ఇచ్చాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో గజిని నటించారు.

కోడలిని లొంగదీసుకునే మామ

కోడలిని మామ లొంగదీసుకునే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కండంతో వివాదమైంది. కొడుకు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్స్ మిలిటెంట్ అయిన తండ్రి కోడలితో నిర్వహించిన అక్రమ సంబంధం కథాంశంతో నేటి చరిత్ర సాగుతుంది. కాన్సెప్ట్‌ మాత్రమే కాకుండా రొమాంటిక్ సీన్లతో నేటి చరిత్రను బోల్డ్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ స్వామి.

లక్షల్లో బడ్జెట్

తండ్రితో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నడిపే ఇల్లీగల్ అఫైర్ గురించి తెలిసిన కొడుకు ఏం చేశాడన్నదే నేటి చరిత్ర స్టోరీ. కాగా ఈ సినిమాకు సుందర్ సి బాబు సంగీతం అందించగా.. మైఖేల్ రాయప్పన్ నిర్మాతగా వ్యవహరించారు. గ్లోబల్ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా కొన్ని లక్షల్లోనే నిర్మించారు.

అప్పట్లో తీవ్ర కాంట్రవర్సీగా మారి ఇప్పుడు తెలుగులోకి వచ్చిన ఈ సినిమాను చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి యూట్యూబ్ ద్వారా చూసేయండి.

Whats_app_banner