Tarakaratna Health Update: తారకరత్నకు గుండెపోటు - నిలకడగా ఆరోగ్య పరిస్థితి
Tarakaratna Health Update: టాలీవుడ్ హీరో తారకరత్న గుండెపోటు తో ఆసుపత్రిలో చేరారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు లోనవ్వడంతో పార్టీ శ్రేణులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
Tarakaratna Health Update: టాలీవుడ్ హీరో తారకరత్న తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు . అతడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు చికిత్సను అందిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నాడు.
ఈ కార్యక్రమంలో తారకరత్న అస్వస్థతకు గురవ్వడంతో టీడీపీ వర్గాలు ఆయన్ని కుప్పంలోని ఈపీఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. గుండెకు రక్తం వెళ్లే నాళాల్లో బ్లాక్ ఏర్పడటంతో తారకరత్నకు గుండెపోటు వచ్చినట్లు టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపాడు. యాంజియోగ్రామ్ పరీక్షలో ఈ సమస్యను వైద్యులు గుర్తించినట్లు ఆయన తెలిపాడు.
పల్స్ రేటు కూడా తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తారకరత్నకు డాక్టర్స్ చికిత్సను అందిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదమేమి లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఊహించినదానికంటే ఎక్కువగా మంది అభిమానులు రావడంతోనే తారకరత్న అస్వస్థతకు లోనైనట్లు తెలిసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో తరచుగా తారకరత్న భాగం అవుతోన్నారు.
టాపిక్