OTT Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ సినిమా.. రెండేళ్ల తర్వాత.. స్ట్రీమింగ్ వివరాలివే..-tamil thriller movie d block streaming now etv win ott in telugu dubbing ott films d block movie ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ సినిమా.. రెండేళ్ల తర్వాత.. స్ట్రీమింగ్ వివరాలివే..

OTT Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ సినిమా.. రెండేళ్ల తర్వాత.. స్ట్రీమింగ్ వివరాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 10, 2024 02:23 PM IST

D Block Telugu OTT Streaming: డీ బ్లాక్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంలో రిలీజైన రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..

OTT Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ సినిమా.. రెండేళ్ల తర్వాత.. స్ట్రీమింగ్ వివరాలివే..
OTT Thriller Movie: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ సినిమా.. రెండేళ్ల తర్వాత.. స్ట్రీమింగ్ వివరాలివే..

తమిళంలో 2022లో డీబ్లాక్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఓ సైకో కిల్లర్‌ను పట్టుకోవడం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. డీ బ్లాక్ చిత్రంలో అరుళ్‍నిధి, చంద్రదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ డీబ్లాక్ సినిమా రెండేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్‍ అయింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే

డీ బ్లాక్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ ఈ ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. తమిళంతో థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ చిత్రం తెలుగులో ఓటీటీలోకి వచ్చింది.

డీ బ్లాక్ సినిమాను కమింగ్ ఆఫ్ ఏజ్ థ్రిల్లర్ చిత్రంగా డైరెక్టర్ విజయ్ కుమార్ రాజేంద్రన్ తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ స్టోరీతో తీసుకొచ్చారు. అయితే కథనం విషయంలోనే మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో అరుళ్‍నిధి, చరణ్‍దీప్‍తో పాటు అవంతిక మిశ్ర, జాక్వెలిన్ ప్రకాశ్, కరు పళనిప్పన్, తలైవాసల్ విజయ్, రమేశ్ ఖన్నా కీలకపాత్రలు పోషించారు.

డీ బ్లాక్ చిత్రాన్ని ఎంఎన్ఎం ఫిల్మ్స్ పతాకంపై అరవింద్ సింగ్ నిర్మించారు. కౌశిక్ క్రిష్ సంగీతం అందించారు. ఈ సినిమా రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఈ లో బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే దక్కించుకుంది.

డీ బ్లాక్ సినిమా స్టోరీలైన్

కాలేజీ అమ్మాయిల అనుమానాస్పద మృతి చుట్టూ డీ బ్లాక్ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిలు తరచూ చనిపోతుంటారు. కాలేజీ పేరు కాపాడుకునేందుకు వణ్యమృగాల వల్లే ఆ అమ్మాయిలు మృతి చెందుతున్నారని యాజమాన్యం చెబుతుంటోంది. అయితే, ఈ మరణాలపై విద్యార్థి అరుళ్ (అరుళ్‍నిధి) అనుమానం వ్యక్తం చేస్తాడు. స్నేహితుడితో కలిసి మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తారు. ఈ మరణాల వెనుక ఎవరు ఉన్నారో గుర్తించాలని నిర్ణయించుకుంటారు. ఓ సైకో కిల్లర్ ఈ హత్యలకు పాల్పడుతున్నారని గుర్తిస్తారు. ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు ఈ హత్యలకు పాల్పడుతున్నాడు? అతడిని అరుళ్ పట్టుకున్నాడా అనేదే ఈ డీ బ్లాక్ సినిమా కథలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

ఈటీవీ విన్‍లో వీరాంజనేయులు విహారయాత్ర

ఈటీవీ విన్ ఓటీటీలోనే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఆగస్టు 14న స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. సీనియర్ యాక్టర్ నరేశ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గోవాలో అస్థికలు కలిపేందుకు కుటుంబం మొత్తం ట్రిప్‍కు వెళ్లడం చుట్టూ ఈ కామెడీ డ్రామా మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వీరాంజనేయులు విహారయాత్ర మూవీ కోసం ఈటీవీ విన్ జోరుగా ప్రమోషన్లను చేస్తోంది. ఈ చిత్రంలో నరేశ్‍, శ్రీలక్ష్మి, రాగ్ మయూర్, ప్రియ, ప్రియదర్శిని, తరుణి కీరోల్స్ చేశారు. ఆగస్టు 14 నుంచి వీరాంజనేయులు విహారయాత్రను ఈటీవీ విన్‍లో చూడొచ్చు.