Star Maa new serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్.. గుండె నిండా గుడిగంటలు.. ఆ రోజు నుంచే..-star maa new serial gunde ninda gudi gantalu to telecast from october 2nd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa New Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్.. గుండె నిండా గుడిగంటలు.. ఆ రోజు నుంచే..

Star Maa new serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్.. గుండె నిండా గుడిగంటలు.. ఆ రోజు నుంచే..

Hari Prasad S HT Telugu
Sep 29, 2023 05:44 PM IST

Star Maa new serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్ గుండె నిండా గుడిగంటలు ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ అక్టోబర్ 2 నుంచి రానుండగా.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 29) ఓ మెలోడియస్ సాంగ్ రిలీజ్ చేశారు.

స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్
స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్

Star Maa new serial: తెలుగులో టాప్ సీరియల్స్ ను రూపొందిస్తున్న స్టార్ మా ఛానెల్లో మరో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ పేరు గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 2 నుంచి ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ను శుక్రవారం (సెప్టెంబర్ 29) ఓ మెలోడియస్ సాంగ్ ద్వారా స్టార్ మా ఛానెల్ చేసింది.

గుండె నిండా గుడి గంటలు అంటూ సాగిపోయే ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సాంగ్ లో హీరోహీరోయిన్లను పరిచయం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కథతో ఈ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్ల ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? అనేదే గుండె నిండా గుడిగంటలు సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది.

తెలుగు లోగిళ్ళలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దులను చేయబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి.

కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. దారితప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం, ఆ తల్లికి కొడుక్కీ మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది.

గుర్తుపెట్టుకోండి.. అక్టోబర్ 2.. రాత్రి 9 గంటలకి.. స్టార్ మా లో సరికొత్త సీరియల్ "గుండె నిండా గుడిగంటలు". ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాటపడ్డాడో, తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.

IPL_Entry_Point