Suma Son Movie: యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి.. టైటిల్ ఇదే-ss rajamouli unveiled anchor suma son roshan kanakala debut movie bubblegum first look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suma Son Movie: యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి.. టైటిల్ ఇదే

Suma Son Movie: యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి.. టైటిల్ ఇదే

Suma son Movie: యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‍ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

Suma Son Movie: యాంకర్ సుమ కుమారుడి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి.. టైటిల్ ఇదే

Suma son Movie: ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. క్షణం, కృష్ణ అండ్ లీల చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రవికాంత్ పారెపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరి ఈ చిత్రం ద్వారా హీరోయిన్‍గా పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్ లుక్‍ను నేడు (అక్టోబర్ 6) ఆవిష్కరించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఫస్ట్ లుక్ ద్వారా టైటిల్ కూడా రివీల్ అయింది.

రోషన్ కనకాల హీరోగా చేస్తున్న ఈ సినిమాకు 'బబుల్‍గమ్' అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‍ను సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించారు రాజమౌళి. “నటుడిగా డెబ్యూట్ చేస్తున్న రోషన్‍కు అభినందనలు. నీ సొంత ముద్రను వేస్తూనే.. రాజీవ్, సుమ గర్వపడేలా చేయాలని ఆశిస్తున్నా. బబుల్‍గమ్ యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

బుబుల్‍గమ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అక్టోబర్ 10న ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక బబుల్‍గమ్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‍గా, రొమాంటిక్‍గా ఉంది. హీరోయిన్‍ మానసను రోహన్ కౌగిలించుకోగా.. నోట్లో బబుల్‍గమ్ ఊదారు. ఈ ఫస్ట్ పోస్టర్‌లో ఇద్దరి లుక్ ట్రెండీగా అదిరిపోయింది.

బుబుల్‍గమ్ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవికాంత్ పేరెపు, విష్ణు కొండూర్, సెరి గన్నీ కలిసి రచన చేశారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అడివి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాకు రవికాంత్ దర్శకత్వం వహించగా.. ఆ చిత్రం మంచి విజయం విజయం సాధించింది. కృష్ణ అండ్ హిస్ లీల సినిమా కూడా రవికాంత్‍కు మంచి పేరు తీసుకొచ్చింది.