RRR wins CCA: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుతో రాజమౌళి.. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్-ss rajamouli taken critics choice award as best foreign film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Wins Cca: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుతో రాజమౌళి.. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్

RRR wins CCA: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుతో రాజమౌళి.. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్

Maragani Govardhan HT Telugu
Jan 16, 2023 10:19 AM IST

RRR wins CCA: దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమాకు పురస్కారం రాగా.. అవార్డును రాజమౌళి స్వీకరించారు.

రాజమౌళి
రాజమౌళి (AFP)

RRR wins CCA: స్టేట్ కాదు.. నేషనల్ కాదు.. ఇఫ్పుడు ఎస్ఎస్ రాజమౌళి స్థాయి అంతర్జాతీయానికి చేరుకుంది. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి పలు ఇంటర్నేషనల్ అవార్డులు వరిస్తున్నాయి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకున్న ఈ సినిమా.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును చేజిక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్ పురస్కారాన్ని గెల్చుకుంది. ఆ పురస్కారాన్ని రాజమౌళి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విటర్ వేదికగా ప్రకటించింది.

28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ విదేశీ చిత్రంగా పురస్కారాన్ని గెల్చుకుంది. ఎస్ఎస్ రాజమౌళి ఈ వేడుకకు హాజరైన అవార్డును తీసుకున్నారు. దీంతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డు నాటు నాటు పాటకు దక్కించింది.

ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు అర్జెంటీనా 1985, బార్డో, ఫాల్స్ క్రోనికల్ ఏ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్, ఆల్ క్వైట్ ఆఫ్ వెస్టర్న్ ఫ్రంట్, క్లోజ్, డిసెషన్ టూ లీవ్ లాంటి సినిమాలను పక్కకు తోసి ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డును సాధించింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ పురస్కారాన్ని రాజమౌళి తీసుకునే వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఖాకీ రంగు ప్యాంట్, ఎరుపు, గ్రే కలర్ మఫ్లర్‌ను ధరించిన మన జక్కన్న వేదికపైకెక్కి అవార్డును స్వీకరించారు. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారం రావడంతో.. ఆ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

Whats_app_banner