OTT: బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ఓటీటీ హక్కులకు భారీ ధర! ఎన్ని కోట్లకు ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..
Singham Again OTT: సింగం అగైన్ సినిమా ఓటీటీ డీల్‍పై సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందో వివరాలు వెల్లడయయ్యాయి.
బాలీవుడ్‍లో ఈ దీపావళికి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రెడీ అయింది. సింగం అగైన్ సినిమా నవంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సింగం ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అజయ్ దేవ్‍గణ్, కరీనా కపూర్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొణ్ ఇలా భారీ తారాగణంతో క్రేజీ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం వస్తోంది. తాజాగా సింగం అగైన్ చిత్రానికి ఓటీటీ డీల్ పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది.
భారీ ధరతో డీల్
సింగం అగైన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏకంగా రూ.130 కోట్ల భారీ ధరకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందని సమాచారం బయటికి వచ్చింది.
సింగం అగైన్ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఈ రేంజ్ భారీ రేటుకు స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడయ్యాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, థియేట్రికల్ రన్‍ను బట్టి అంతకు ముందే రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది.
ట్రైలర్‌కు మిక్స్డ్ రెస్పాన్స్
సింగం అగైన్ సినిమా ట్రైలర్ సోమవారమే (అక్టోబర్ 7) వచ్చింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ట్రైలర్ ఉంది. ఇతిహాసం రామాయణం రిఫరెన్స్‌లతో ఈ మూవీని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. అజయ్ దేవ్‍గణ్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్ యాక్షన్‍తో దుమ్మురేపారు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ విలన్‍గా నటిస్తున్నారు. కాగా, సింగం అగైన్ ట్రైలర్‌కు నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
సింగం అగైన్ సినిమా పాత మాస్ మసాలా యాక్షన్‍తోనే ఉంటుందని ట్రైలర్‌తోనే తేలిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ మూవీ కోసం రామాయణాన్ని వాడుకోవడం సరికాదంటూ విమర్శించారు. ఈ ట్రైలర్ క్రింజ్‍గా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆశించిన స్థాయిలో ట్రైలర్ ఈ మూవీకి పాజిటివ్ బజ్‍ను తీసుకురాలేకపోయింది. సింగం అగైన్ చిత్రంలో జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేత తివారి, సిద్ధార్థ జాదవ్, రవి కిషన్ కూడా కీలకపాత్రలు పోషించారు.
సింగం ఫ్రాంచైజీలో మూడో మూవీగా.. సింగం రిటర్న్స్ మూవీకి సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. సింగం అగైన్ మూవీకి థమన్, రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‍మెంట్, జియో స్టూడియోస్, దేవ్‍గణ్ ఫిల్మ్స్, సినెర్జీ బ్యానర్లపై జ్యోతి దేశ్‍పాండే, రోహిత్ శెట్టి, అజయ్ దేవ్‍గణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. గిరీశ్ కాంత్, రజా హుసేన్ మెహతా సినిమాటోగ్రాఫర్లుగా చేయగా.. బంటీ నాగి ఎడిటింగ్ చేశారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. దీపావళికి వస్తున్న ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.