Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు-deepika padukone shows off her baby bump in stunning maternity photoshoot with ranveer singh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు

Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 02, 2024 08:38 PM IST

Deepika Padukone Baby Bump: గర్భిణిగా ఉన్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ బేబీ బంప్ చూపిస్తూ ఫొటోషూట్ చేశారు. భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు
Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు

బాలీవుడ్ స్టార్లు రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణ్ త్వరలోనే తొలిసారి తల్లిదండ్రులు కానున్నారు. బాలీవుడ్‍లో పాపులర్ జంటగా ఉన్న ఈ ఇద్దరూ ఈనెల(సెప్టెబంబర్)లోనే ఆ శుభవార్త చెప్పనున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొణ్ నిండు గర్భిణిగా ఉన్నారు. ఈనెలలోనే ఆమె ప్రసవించనున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలో తన బేబీ బంప్‍ను చూపిస్తూ మెటర్నిటీ ఫొటోషూట్ చేశారు దీపికా పదుకొణ్. భర్త రణ్‍వీర్ కూడా ఇందులో ఉన్నారు.

కళ్లు తిప్పుకోలేని విధంగా..

ఈ ఫొటో షూట్‍లో బేబీ బంప్ (గర్భాన్ని) చూపించారు దీపికా పదుకొణ్. ఈ ఫొటోల్లో ఆమె చాలా అపురూపంగా కనిపించారు. చాలా సంతోషంగా కనిపించారు. బ్లాక్ అండ్ వైట్‍లో ఈ ఫొటోలను నేడు (సెప్టెంబర్ 2) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు దీపికా.

తొలి ఫొటోలో దీపికా పదుకొణ్, రణ్‍వీర్ నవ్వులు కురిపిస్తూ ప్రేమగా ఉన్నారు. దీపికా బేబీ బంప్ కనిపించేలా ఆ తర్వాత కొన్ని ఫొటోలు ఉన్నాయి. దీపికాను వెనుక నుంచి రణ్‍వీర్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్న ఫొటో ఉంది. మొత్తంగా 14 స్టన్నింగ్ ఫొటోలను ఈ బాలీవుడ్ దంపతులు పోస్ట్ చేశారు. ఈ ఫొటోలన్నీ చూడముచ్చటగా ఉన్నాయి.

సంతోషంలో ఫ్యాన్స్

దీపికా, రణ్‍వీర్ ఈ మెటర్నిటీ ఫొటోషూట్ పోస్ట్ చేయడంతో వారి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ మెటెర్నిటీ ఫొటో షూట్ అని అంటున్నారు. బెస్ట్ కపుల్‍గా ఉన్న వీరిద్దరూ.. బెస్ట్ పేరెంట్స్ కానున్నారంటూ కొందరు రాసుకొచ్చారు. బ్యూటిఫుల్ అంటూ హార్ట్ ఎమోజీలను చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

దీపికా పదుకొణ్‍కు దిష్టి తగిలేలా ఉందని, ఇంటికి వెళ్లి ఇద్దరూ దిష్టి తీయించుకోవాలని ఓ యూజర్ కామెంట్ చేశారు. మొత్తంగా వీరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

డెలివరీ డేట్ ఇదే!

దీపికా పదుకొణ్ సెప్టెంబర్ 28వ తేదీన ప్రసవించనున్నారని తెలుస్తోంది. డెలివరీకి వైద్యులు ఈ తేదీని ఇచ్చారనే సమాచారం బయటికి వచ్చింది. దీంతో రణ్‍వీర్, దీపికా తొలి సంతానాన్ని పొందనున్నారు. తల్లిదండ్రులు కానున్నారు.

రూమర్లకు చెక్

దీపికా పదుకొణ్‍ది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటూ కూడా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై విమర్శలు వచ్చాయి. అయితే, ఈ మెటెర్నటీ ఫొటోషూట్‍తో రూమర్లకు చెక్ పెట్టేశారు దీపికా, రణ్‍వీర్. ఈ విషయంలో విమర్శించిన వారి నోరు మూయించారు.

సినిమాలు ఇలా..

దీపికా పదుకొణ్ ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో సుమతి అనే ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. కల్కి 2లోనూ దీపికా పాత్ర కీలకంగా ఉండనుంది. ఇక అజయ్ దేవ్‍గణ్ హీరోగా నటించిన.. సింగం అగైన్ చిత్రంలోనూ దీపికా నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. రణ్‍వీర్ సింగ్ ప్రస్తుతం దర్శకుడు ఆదిత్య ధార్‌తో మూవీ షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. డాన్ 3 సినిమా కూడా ఆయన లైనప్‍లో ఉంది. సింగం అగైన్‍లోనూ రణ్‍వీర్ క్యామియో రోల్‍లో కనిపించనున్నారు.