Singer Mangli: యాంకర్ అనసూయ మూవీ నుంచి సింగర్ మంగ్లీ వెర్షన్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన వ్యూస్.. మీరు విన్నారా?-singer mangli version chinnari kittayya song released from anasuya bharadwaj ari movie chinnari kittayya song views ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Singer Mangli: యాంకర్ అనసూయ మూవీ నుంచి సింగర్ మంగ్లీ వెర్షన్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన వ్యూస్.. మీరు విన్నారా?

Singer Mangli: యాంకర్ అనసూయ మూవీ నుంచి సింగర్ మంగ్లీ వెర్షన్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన వ్యూస్.. మీరు విన్నారా?

Sanjiv Kumar HT Telugu
Aug 19, 2024 01:38 PM IST

Anasuya Ari Mangli Chinnari Kittayya Song Release: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన లేటెస్ట్ మూవీ అరి నుంచి ఇటీవల చిన్నారి కిట్టయ్య అనే పాటను విడుదల చేశారు. సింగర్ మంగ్లీ వెర్షన్‌గా రిలీజ్ అయిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

యాంకర్ అనసూయ మూవీ నుంచి సింగర్ మంగ్లీ వెర్షన్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన వ్యూస్.. మీరు విన్నారా?
యాంకర్ అనసూయ మూవీ నుంచి సింగర్ మంగ్లీ వెర్షన్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన వ్యూస్.. మీరు విన్నారా?

Singer Mangli Chinnari Kittayya Song: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది యాంకర్ అనసూయ భరద్వాజ్. అనసూయ నటించిన లేటెస్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీనే అరి. ఆర్‌వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పేపర్ బాయ్ సినిమాతో

అరి సినిమాకు 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. అనసూయ భరద్వాజ్‌తోపాటు వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ అరి సినిమా తెరకెక్కుతోంది.

‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ‘అరి’ సినిమా నుంచి చిన్నారి కిట్టయ్య లిరికల్ సాంగ్ మంగ్లీ వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట విడుదలై హిట్ అయింది.

కృష్ణుడి గురించి

ఇప్పుడు చిన్నారి కిట్టయ్య పాట మంగ్లీ వెర్షన్‌ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో 2.5 మిలియన్స్‌కుపైగా వ్యూస్ వచ్చి అదరగొడుతోంది. కృష్ణుడి గురించి సాగే ఈ గాతం యావత్ నెటిజన్స్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదిలా ఉంటే, చిన్నారి కిట్టయ్య పాట రిలీజ్ వేడుకలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ - "అరి సినిమా గురించి వింటున్నాను. ఈ మూవీ డైరెక్టర్ జయశంకర్ గతంలో పేపర్ బాయ్ అనే మంచి మూవీ రూపొందించారు. ఈ సినిమా కూడా ఆయనకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అరి సినిమాలో 'చిన్నారి కిట్టయ్య' పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ

అరి సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. అరి మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. కాగా అరి మూవీలో చాలా మంది నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.

వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్‌తోపాటు వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

సుమన్-ఆమనితోపాటు

అలాగే, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు కూడా అరి మూవీలో నటిస్తున్నారు.