Attack On Mangli Car : కర్ణాటకలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి-stone pelting on singer mangli car in bellary festival here s complete details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Attack On Mangli Car : కర్ణాటకలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Attack On Mangli Car : కర్ణాటకలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Anand Sai HT Telugu
Jan 22, 2023 02:06 PM IST

Attack On Singer Mangli Car : కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

మంగ్లీ కారుపై దాడి
మంగ్లీ కారుపై దాడి

సింగర్ మంగ్లీ(Singer Mangli) కారుపై బళ్లారిలో రాళ్ల దాడి జరిగింది. శ‌నివారం రాత్రి ఈ ఘటన అయినట్టుగా తెలుస్తోంది. బళ్లారి(bellary) మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో సింగర్ మంగ్లీ పాల్గొంది. కార్యక్రమం అయిపోయాక.. వేదిక నుంచి తిరిగి వెళ్లేప్పుడు కార్యక్రమానికి వచ్చిన కొంతమంది ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు.

బళ్లారి ఉత్సవం (బళ్లారి ఫెస్టివల్) అట్టహాసంగా మెుదలైంది. రెండు రోజుల ఉత్సవాన్ని మంత్రి శ్రీరాములు ప్రారంభించారు. ఉత్సవంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. శాండిల్ వుడ్ ప్రముఖ యాంకర్ అనుశ్రీ(Anchor Anushree), సంగీత దర్శకుడు అర్జున్ బృందం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రొగ్రామ్ ముగించుకుని వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొంతమంది రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది.

బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ స్టేజ్ మీద పాటలు పాడింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెను చూసేందుకు యువకులు ఎగబడ్డారు. వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించారు. వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు. మంగ్లీ వెళ్ళేటప్పుడు కొంతమంది యువకులు కారుపై రాళ్లతో దాడి చేశారు.

కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొంది. ఈ సమయంలో మంగ్లీ(Mangli)ని యాంకర్ అనుశ్రీ వేదిక మీదకు పిలించింది. వస్తూ.. మంగ్లీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో చెప్పింది. ఇక్కడ కన్నడవారు ఉన్నారు.. కన్నడలో మాట్లాడండి.. అని అనుశ్రీ చెప్పినప్పుడు.. పక్కన అనంతపురం ఉంది.. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ సమాధానమిచ్చింది. బలవంతం చేయగా కన్నడ(Kannada)లో ఒకటి రెండు మాటలు మాట్లాడింది మంగ్లీ. అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు నాకు అర్థం కావడం లేదని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుంది. నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని, ఆమెకి కన్నడ అర్థం కాదు? ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడటానికి భయపడే ఆమెకు కన్నడలో ఎందుకు అవకాశం ఇస్తారో? అని కొంతమంది మండిపడ్డారు. ఇలాంటి ఘటన తర్వాత.. ఆమె కారుపై రాళ్ల దాడి జరిగింది.

'రాబర్ట్' సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో 'ఏక్ లవ్ యా' చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. 'పుష్ప' సినిమా(Pushpa Movie) ఊ అంటావా మామ పాటను కన్నడలో మంగ్లీనే పాడింది.

Whats_app_banner