Shaitan in OTT: ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. హాట్‌స్టార్‌లో సైతాన్ కొత్త రికార్డు
Shaitan in OTT: ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా హాట్‌స్టార్‌లో సైతాన్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు ఉండగా.. అందుకు తగినట్లే దూసుకెళ్తోంది.
Shaitan in OTT: హాట్‌స్టార్ ఓటీటీలో సైతాన్ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన ప్రాంతీయ వెబ్ సిరీస్ గా సైతాన్ నిలవడం విశేషం. ఇప్పటికే ఈ సిరీస్ కు లక్షల కొద్దీ వ్యూయింగ్ మినట్స్ నమోదయ్యాయి. నిజానికి ఈ సైతాన్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇందులోని బూతులు, హింస ఎక్కువగా ఉండటంపై విమర్శలు వచ్చాయి.
అయినా సిరీస్ ఓటీటీలోకి రాగానే జనాలు ఎగబడి చూసేస్తున్నారు. మహీ వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన సైతాన్ సిరీస్ జూన్ 15 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. దీనికి తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు రావడం కూడా సిరీస్ సక్సెస్ కు కారణమైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ దీనిని చూడటం కాస్త కష్టమే అయినా.. మిగతా సెక్షన్ల నుంచి సైతాన్ కు క్రేజ్ పెరిగిపోతోంది.
ఈ మధ్యే హాట్‌స్టార్ లోనే వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కంటే కూడా ఈ సైతాన్ కు నాలుగు రెట్లు ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. రోజురోజుకూ ఈ సిరీస్ కు ఆదరణ పెరుగుతూనే ఉన్నట్లు హాట్‌స్టార్ వర్గాలు వెల్లడించాయి.
వెండితెరపై చూపించలేని బోల్డ్, ఎరోటిక్ కథాంశాల్ని ప్రేక్షకులతో చెప్పడానికి ఓటీటీ ఒక చక్కటి వేదికగా మారిపోయింది. సైతాన్ అలాంటి కథే. తాను బతకడం కోసం, తన వారికి బతికించుకోవడం తప్పని పరిస్థితుల్లో నేరస్తుడిగా మారిన బాలి అనే వ్యక్తి జీవితం నేపథ్యంలో మహి.వి రాఘవ్ సైతాన్ కథను రాసుకున్నాడు.
ఈ సిరీస్‌ను క్లీన్‌గా ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్, హింస లేకుండా కూడా చూపించవచ్చు. కానీ ఆ దారిలో కాకుండా కంప్లీట్‌గా బోల్డ్, రస్టిక్ దారిని మహి వి. రాఘవ్ ఎంచుకున్నాడు.హార్డ్ హిట్టింగ్ వేలో ప్రేక్షకులకు ఈ సిరీస్‌ను చూపించే ప్రయత్నం చేశారు.
సైతాన్ సిరీస్ లో ప్రధాన పాత్రధారలు మాట్లాడే ప్రతి డైలాగ్‌లో ఓ బూతు వినిపిస్తుంటుంది. ఎరోటిక్ సీన్స్ విషయంలో సినిమాటిక్ టెక్నిక్స్ ఫాలో కాకుండా మహి. వి. రాఘవ్ బోల్డ్‌గా చూపించాడు. బాలి రివేంజ్ తీర్చుకునే సన్నివేశాల్లో హింస, రక్తపాతం డోస్ కాస్త ఎక్కువే ఉంది. వాటితోనే సైతాన్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయడానికి డైరెక్టర్ మహి. వి.రాఘవ్ ప్రయత్నించినట్లుగా కనిపించింది.
సంబంధిత కథనం