Shaitan Web Series Review: సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ - మ‌హి వి రాఘ‌వ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే?-shaitan web series review mahi v raghav crime thriller web series streaming disney plus hot star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaitan Web Series Review: సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ - మ‌హి వి రాఘ‌వ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే?

Shaitan Web Series Review: సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ - మ‌హి వి రాఘ‌వ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 12:18 PM IST

Shaitan Web Series Review: రుషి, కామాక్షి భాస్క‌ర్ల‌, దేవ‌యాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వెబ్‌సిరీస్ సైతాన్‌. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో రిలీజైన ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందంటే....

 సైతాన్‌ వెబ్‌సిరీస్
సైతాన్‌ వెబ్‌సిరీస్

Shaitan Web Series Review: బోల్డ్ డైలాగ్స్‌, సీన్స్‌తో ఈ మ‌ధ్య‌కాలంలో యూత్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ లలో సైతాన్ ఒక‌టి. మ‌హి వి రాఘ‌వ్ (Mahi v raghav) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ చిన్నా వాసుదేవ‌రెడ్డితో క‌లిసి నిర్మించిన ఈ సిరీస్ గురువారం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో రిలీజైంది. రుషి, దేవ‌యాని, కామాక్షి భాస్క‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సేవ్ ది టైగ‌ర్స్ త‌ర్వాత మ‌హి వి రాఘ‌వ్ నుంచి వ‌చ్చిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఈ బోల్డ్ అంటెప్ట్ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? లేదా? అన్న‌ది చూద్దాం...

బాలి కుటుంబ క‌థ‌...

సావిత్రికి ముగ్గురు పిల్ల‌లు. కుటుంబ బాధ్య‌త‌ల్ని వ‌దిలిపెట్టి భ‌ర్త పారిపోవ‌డంతో పిల్ల‌ల్ని పోషించ‌డం కోసం విధిలేని ప‌రిస్థితుల్లో యాకుబ్ అలీ అనే పోలీస్ కానిస్టేబుల్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుంది. త‌ల్లి చేసే ప‌ని ఆమె పిల్ల‌లు బాలి(రుషి), జ‌యప్ర‌ద‌(దేవ‌యాని), గుమ్తిల‌కు (జాఫ‌ర్ సాధిక్‌) న‌చ్చ‌దు. కుటుంబాన్ని క‌ష్ట‌ప‌డి పోషించాల‌ని బాలి అనుకుంటాడు.

కానీ ఎవ‌రూ అత‌డికి ప‌ని ఇవ్వ‌రు. ర‌క్తాన్ని చూసి భ‌య‌ప‌డే బాలి అనుకోని ప‌రిస్థితుల్లో త‌ల్లితో క‌లిసి ఉంటోన్న కానిస్టేబుల్ యాకుబ్ అలీని చంపేస్తాడు. నేర‌మ‌య సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన బాలి జీవితం చివ‌ర‌కు ఏమైంది? డ‌బ్బు కోసం ఎలాంటి నేరానికైనా సిద్ధ‌ప‌డే బాలి ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న‌తోనే ద‌ళంలో చేరాడా?

ద‌ళ స‌భ్యురాలు క‌ళావ‌తితో ఆనందంగా బ‌త‌కాల‌ని అనుకున్న బాలి క‌ల నెర‌వేరిందా? బాలిని చంపాల‌ని అనుకున్న పోలీస్ ఆఫీస‌ర్ రామిరెడ్డి ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? అన్న చేసే ప్ర‌తి ప‌నికి అండ‌గా ఉండే బాలి సోద‌రుడు గుమ్తితో పాటు తాను ప్రేమించిన మూగ‌వాడిని పెళ్లిచేసుకోలేని సోద‌రి జ‌యల జీవితం ఏమైంద‌న్న‌దే సైతాన్ సిరీస్ క‌థ‌.

ఓటీటీ వేదిక‌....

వెండితెర‌పై చూపించ‌లేని బోల్డ్‌, ఎరోటిక్ క‌థాంశాల్ని ప్రేక్ష‌కుల‌తో చెప్ప‌డానికి ఓటీటీ ఒక చ‌క్క‌టి వేదిక‌గా మారిపోయింది. సైతాన్ అలాంటి క‌థే. తాను బ‌త‌క‌డం కోసం, త‌న వారికి బ‌తికించుకోవ‌డం త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో నేర‌స్తుడిగా మారిన బాలి అనే వ్య‌క్తి జీవితం నేప‌థ్యంలో మ‌హి.వి రాఘ‌వ్ సైతాన్ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ సిరీస్‌ను క్లీన్‌గా ఎలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, హింస లేకుండా కూడా చూపించ‌వ‌చ్చు. కానీ ఆ దారిలో కాకుండా కంప్లీట్‌గా బోల్డ్‌, ర‌స్టిక్ దారిని మ‌హి వి. రాఘ‌వ్ ఎంచుకున్నాడు.హార్డ్ హిట్టింగ్ వేలో ప్రేక్ష‌కుల‌కు ఈ సిరీస్‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

ప్ర‌తి డైలాగ్‌లో బూతు....

సైతాన్ సిరీస్ లో ప్ర‌ధాన పాత్ర‌ధార‌లు మాట్లాడే ప్ర‌తి డైలాగ్‌లో ఓ బూతు వినిపిస్తుంటుంది. ఎరోటిక్ సీన్స్ విష‌యంలో సినిమాటిక్ టెక్నిక్స్ ఫాలో కాకుండా మ‌హి. వి. రాఘ‌వ్ బోల్డ్‌గా చూపించాడు. బాలి రివేంజ్ తీర్చుకునే స‌న్నివేశాల్లో హింస‌, ర‌క్త‌పాతం డోస్ కాస్త ఎక్కువే ఉంది. వాటితోనే సైతాన్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయ‌డానికి డైరెక్ట‌ర్ మ‌హి. వి.రాఘ‌వ్ ప్ర‌య‌త్నించిన‌ట్లుగా క‌నిపించింది.

తొమ్మిది ఎపిసోడ్స్‌...

మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌తో మ‌హి.వి రాఘ‌వ్ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ ఎపిసోడ్‌లో బాలి బాల్య జీవితం, ర‌క్తం చూస్తేనే భ‌య‌ప‌డే బాలి ఎలా నేర‌స్తుడిగా మారాడ‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా ఆవిష్క‌రించారు. జ్యూవెల్ల‌రీ షాప్ ఓన‌ర్ చేసిన మోసంతో బాలి విప్ల‌వ బాట ప‌ట్ట‌డం సిరీస్ కొత్త ట‌ర్న్ తీసుకుంటుంది. క‌ళావ‌తిపై ఇష్టంతో ద‌ళంలో చేరిన బాలి గొప్ప నాయ‌కుడిగా ఎలా ఎదిగాడ‌న్న‌ది యాక్ష‌న్ స‌న్నివేశాల, రివేంజ్ అంశాల చుట్టూ న‌డిపించారు.

రియ‌లిస్టిక్ స‌న్నివేశాల స్ఫూర్తితో...

చివ‌ర‌కు హోమ్ మంత్రికే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిన బాలి జీవితం ఎలా ముగిసింద‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా చూపించారు. విప్ల‌వ బాట‌లో పోలీసులు చేసే ఫేక్ ఎన్‌కౌంట‌ర్‌లు, త‌ప్పు చేసిన క్రిమిన‌ల్స్ త‌మ‌ది రైట్ అని ఎలా స‌మ‌ర్థించుకుంటారన్నది స‌హ‌జంగా ఈ సిరీస్‌లో ఆవిష్క‌రించారు.

బాలి పాత్ర‌లో...

బాలి పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేశాడు రుషి. అమాయ‌క‌త్వంతో పాటు క్రూయాలిటీని చ‌క్క‌గా త‌న న‌ట‌న ద్వారా ఆవిష్క‌రించారు. జ‌యగా దేవ‌యాని బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కామాక్షి భాస్క‌ర్ల‌, ర‌వికాలే, జాఫ‌ర్ సాధిక్ తో పాటు ప్ర‌తి ఒక్క‌రూ డిఫ‌రెంట్, రియలిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించారు.

Shaitan Web Series Review -ఫ్యామిలీతో చూడ‌టం క‌ష్ట‌మే...

సైతాన్ బోల్డ్ అండ్ డేరింగ్ అటెంప్ట్‌గా చెప్ప‌వ‌చ్చు. ఫ్యామిలీతో క‌లిసి ఈ సిరీస్‌ను చూడ‌టం క‌ష్ట‌మే. ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియెన్స్‌ను మాత్ర‌మే ఈ సిరీస్ మెప్పిస్తుంది.

రేటింగ్‌: 3/5

IPL_Entry_Point