Shaitaan 3 Days Collection: మాంత్రికుడిగా మాధవన్.. 50 కోట్లు దాటేసిన సైతాన్.. సండే రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Shaitaan Day 3 Box Office Collection: తమిళ వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ విలన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ సైతాన్. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రాగా కలెక్షన్స్ సైతం బాగుంటున్నాయి. ఈ నేపథ్యంలో సైతాన్ 3 డేస్ కలెక్షన్స్ చూస్తే..
Shaitaan 3 Days Collection: అజయ్ దేవగన్ , జ్యోతిక, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ నాచురల్ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైనప్పటి నుంచి దేశీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. Sacnilk.com నివేదిక ప్రకారం, సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు పేర్కొంది.
భారతదేశంలో సైతాన్ బాక్సాఫీస్ కలెక్షన్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సైతాన్ సినిమా భారతదేశంలో శుక్రవారం రూ. 14.75 నెట్ కలెక్షన్స్‌తో ఓపెనింగ్ చేసింది. తర్వాత రెండో రోజు అయిన శనివారం రూ. 18.75 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం సైతాన్ సినిమా వసూళ్లు దాదాపు రూ. 20 కోట్లుగా అంచనా వేశారు. ఇలా మూడు రోజుల్లో కలిపి మొత్తంగా సైతాన్ సినిమాకు రూ. 53 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సైతాన్ గురించి మరింతగా
అలాగే, ఆదివారం నాడు సైతాన్ సినిమాకు హిందీలో మొత్తంగా 36.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ నిర్మించారు. సైతాన్ సినిమాకు అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక కృష్ణదేవ్ యాగ్నిక్ తెరకెక్కించిన గుజరాతీ మూవీ వాష్‌కు సైతాన్ అధికారిక రీమేక్ చిత్రం.
అతీంద్రియ శక్తులు
సైతాన్ సినిమాలో జాంకీ బోడివాలకు జ్యోతిక తల్లి పాత్ర చేసింది. అలాగే అజయ్ దేవగన్‌కు భార్యగా నటించింది ఈ సినిమాలో ఆర్ మాధవన్ విలన్‌గా నటించాడు. అతీంద్రియ శక్తులు, వశీకరణం తదితర బ్లాక్ మ్యాజిక్ విషయాల్లో నిపుణుడుగా ఆర్ మాధవన్ నటన అదిరిపోయిందని రివ్యూస్ వచ్చాయి.
తన పాత్రపై జ్యోతిక కామెంట్స్
నిజ జీవితంలో తల్లిగా మంచి పాత్ర పోషిస్తున్న జ్యోతిక సినిమాలో మదర్ రోల్ చేయడంపై ఏఎన్ఐకి ఆసక్తకిర విషయాలు పంచుకున్నారు. "సైతాన్ సినిమాలో మాతృత్వాన్ని మంటగలిపే సన్నివేశాలు చాలా ఉన్నాయి. నేను వాటిని బహిర్గతం చేయాలనుకోవట్లేదు. కానీ, ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి గల ముఖ్యమైన కారణాల్లో అది కూడా ఒకటి. టీనేజ్ కూతురి పట్ల ఎంత బాధ్యతగా మెలగాలి, ఆమెను రక్షించే విషయంలో తల్లి, తండ్రి ఎలాంటి పాత్ర పోషిస్తారు అనే విషయాన్ని ఈ చిత్రం మీకు తెలియజేస్తుందని నేను అనుకుంటున్నాను" అని జ్యోతిక అన్నారు.
షైతాన్‌లో తన పాత్రపై జ్యోతిక
జ్యోతిక షైతాన్‌లో నటుడు జాంకీ బోడివాలాకు తల్లి పాత్రలో కనిపించింది, ఇందులో అజయ్ దేవగన్ మరియు ఆర్ మాధవన్ కూడా నటించారు. తెరపై తల్లిగా నటించడం మరియు నిజ జీవితంలో ఒకటి కావడం గురించి జ్యోతిక ANIతో మాట్లాడుతూ, "సినిమాలో మాతృత్వాన్ని మంటగలిపే సన్నివేశాలు చాలా ఉన్నాయి మరియు నేను వాటిని బహిర్గతం చేయాలనుకుంటున్నానో లేదో నాకు తెలియదు, కానీ వాటిలో ఒకటి నేను ఈ చిత్రానికి కూడా ఓకే చెప్పడానికి చాలా ముఖ్యమైన కారణం.నేను టీనేజ్ కూతురి పట్ల ఎంత బాధ్యతగా మెలగాలి మరియు రక్షిత ప్రయాణంలో తల్లి మరియు తండ్రి ఎలాంటి పాత్ర పోషిస్తారు అనే విషయాన్ని ఈ చిత్రం మీకు గుర్తు చేస్తూనే ఉంది అని నేను అనుకుంటున్నాను. వారి పిల్లలు."
వినోదం! వినోదం! వినోదం! 🎞️🍿💃 మా Whatsapp ఛానెల్‌ని అనుసరించడానికి క్లిక్ చేయండి 📲 మీ రోజువారీ గాసిప్‌లు, సినిమాలు, షోలు, సెలబ్రిటీల అప్‌డేట్‌లు అన్నీ ఒకే చోట