Horror Movie: 6 లక్షల బడ్జెట్, 800 కోట్ల కలెక్షన్స్.. RRR, యానిమల్‌, జవాన్‌కు మించి ఆ హారర్ మూవీ-worlds most profitable movie paranormal activity with 6 lakh budget and box office collection more than rrr animal jawan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Movie: 6 లక్షల బడ్జెట్, 800 కోట్ల కలెక్షన్స్.. Rrr, యానిమల్‌, జవాన్‌కు మించి ఆ హారర్ మూవీ

Horror Movie: 6 లక్షల బడ్జెట్, 800 కోట్ల కలెక్షన్స్.. RRR, యానిమల్‌, జవాన్‌కు మించి ఆ హారర్ మూవీ

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 02:25 PM IST

Paranormal Activity Box Office And Budget: సాధారణంగా పెద్ద సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తాయని అనుకుంటాం. కానీ అతి చిన్న సినిమాగా విడుదలై అతి భారీ చిత్రాలను తలదన్నేలా కలెక్షన్స్ వసూలు చేసిన మూవీ పారానార్మల్ యాక్టివిటీ. ఈ హారర్ మూవీకి RRR, యానిమల్, జవాన్‌‌కు మించి కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

6 లక్షల బడ్జెట్, 800 కోట్ల కలెక్షన్స్.. RRR, యానిమల్‌, జవాన్‌కు మించి ఆ హారర్ మూవీ
6 లక్షల బడ్జెట్, 800 కోట్ల కలెక్షన్స్.. RRR, యానిమల్‌, జవాన్‌కు మించి ఆ హారర్ మూవీ

Paranormal Activity Franchise Collections: భారీ బడ్జెట్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయి. అలాంటి సినిమాలు బడా స్టార్స్, భారీ మార్కెటింగ్, అతి భారీ బడ్జెట్ కలిగి ఉంటాయి. ఈ కారణాలు ఎక్కువగా ప్రజలకు చేరేలా చేస్తుంది. దాంతో ప్రమోషన్స్ వర్కౌట్ అయి సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అదిరిపోతాయి.

అతి తక్కువ కలెక్షన్స్

అయితే, ఒక్కోసారి ఈ ఫార్ములా బెడిసికొడుతుంది కూడా. భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ కాకుండా స్లీపర్ హిట్‌గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్నో కోట్లతో తెరకెక్కించిన సినిమాలు అతి తక్కువ కలెక్షన్స్ సాధించినవి ఉన్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన సందర్భాలు కూడా అనేకం. అలాంటి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి ఏకంగా 133,000% లాభాన్ని అందుకున్న సినిమా ఉండటం విశేషంగా మారింది.

అన్నీ ఒక్కడై

అదే పారానార్మల్ యాక్టివిటీ మూవీ. 2007లో మొదటిసారి డైరెక్టర్ ఓరెన్ పెలి తెరకెక్కించిన హారర్ మూవీనే ఈ పారానార్మల్ యాక్టివిటీ. ఈ సినిమాకు ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఫౌండ్-ఫుటేజ్ శైలీని ఉపయోగించారు. అంటే, CCTV కెమెరాలు, హ్యాండ్‌హెల్డ్ కెమెరాలు మాత్రమే ఉపయోగించి ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, చిత్రీకరణ, నిర్మించడం, ఎడిటింగ్ ఇలా అన్నీ ఎరెన్ పెలి స్వయంగా తన బడ్జెట్‌తో చేసాడు.

800 కోట్ల కలెక్షన్స్

నివేదికల ప్రకారం, పారానార్మల్ యాక్టివిటీ సినిమా 15 వేల డాలర్లు (అప్పట్లో రూ. 6 లక్షలు) బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇది స్టూడియోలకు విక్రయించిన తర్వాత పోస్ట్-ప్రొడక్షన్, మార్కెటింగ్‌తో కలిపి మొత్తంగా 2 లక్షల డాలర్స్ (రూ. 85 లక్షలు) అదనంగా ఖర్చు అయింది. అయితే పారానార్మల్ యాక్టవిటీ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 194 మిలియన్ డాలర్స్ (అప్పట్లో రూ. 800 కోట్లు) వసూలు చేసింది.

అత్యంత ఫ్రాఫిటబుల్ మూవీ

ఇది సుమారుగా 133,000% లాభం. ఇప్పటివరకు ఇంతలా లాభాలు పొందిన సినిమా లేదు. పారానార్మల్ యాక్టివిటీ సినిమానే అత్యంత లాభదాయకమైన చిత్రం. అనంతరం ఈ సినిమాకు సీక్వెల్స్‌ చాలానే వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు మొత్తంగా 7 సినిమాలు వచ్చాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీ చిత్రాలు అన్ని కలిసి ప్రపంచవ్యాప్తంగా 890 మిలియన్ డాలర్స్ వసూలు చేశాయి. అంటే, రూ. 4600 కోట్లకు పైగా (వివిధ సంవత్సరాల మారకపు ధరల ప్రకారం చూస్తే) వసూళ్లు వచ్చాయి.

5 వేల కోట్లకుపైగా

అదనంగా, డిజిటల్ హక్కులు, టెలివిజన్ రైట్స్ ఇలా అన్ని కలిపి ఈ ఫ్రాంచైజీకి దాదాపుగా రూ. 5000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు డీఎన్ఏ ఇండియా మీడియా తెలిపింది. కేవలం రూ.6 లక్షల బడ్జెట్‌తో (పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత రూ. 1 కోటి లోపు ఖర్చు) తీసినప్పటికీ పారానార్మల్ యాక్టివిటీ సినిమా అతి భారీ విజయాన్ని అందుకుంది. దీనికి వచ్చిన 193 మిలియన్ డాలర్స్ (రూ. 800 కోట్లు) దాదాపు అన్ని భారతీయ చిత్రాల కంటే ఎక్కువ.

వెనుకంజలో బాహులి, ఆర్ఆర్ఆర్

ఉదాహరణకు బాహుబలి సినిమా 100 మిలియన్ డాలర్లలోపు వసూళ్లు సాధించింది. అలాగే RRR చాలా పెద్ద హిట్ అయినా, కేవలం 160 మిలియన్ డాలర్స్‌కు పైగా వసూళ్లు సంపాదించగలిగింది. ఇక షారుక్ ఖాన్ జవాన్ (140 మిలియన్ డాలర్స్), సందీప్ రెడ్డి వంగా యానిమల్ (110 మిలియన్ డాలర్స్) వంటి ఇతర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు కూడా ఈ హారర్ మూవీకి వెనుకంజలోనే ఉన్నాయి. అయితే, ఇవన్ని అతి భారీ సినిమాలే కావడం గమనార్హం.