Shaakuntalam Second Single: శాకుంతలం నుంచి అదిరిపోయే మెలోడీ.. మైమరిపిస్తున్న సిద్ శ్రీరామ్-shaakuntalam second single rushivanamlona is a soothing melody sang by sid sriram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Second Single: శాకుంతలం నుంచి అదిరిపోయే మెలోడీ.. మైమరిపిస్తున్న సిద్ శ్రీరామ్

Shaakuntalam Second Single: శాకుంతలం నుంచి అదిరిపోయే మెలోడీ.. మైమరిపిస్తున్న సిద్ శ్రీరామ్

Hari Prasad S HT Telugu
Jan 25, 2023 09:16 PM IST

Shaakuntalam Second Single: శాకుంతలం నుంచి అదిరిపోయే మెలోడీ సాంగ్ బుధవారం (జనవరి 25) రిలీజ్ అయింది. ఈ పాటలో సిద్ శ్రీరామ్ తన గళంతో మైమరిపిస్తున్నాడు.

శాకుంతలంలో సమంత
శాకుంతలంలో సమంత

Shaakuntalam Second Single: సమంత మోస్ట్ అవేటెడ్ మూవీ శాకుంతలం. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో దుశ్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు.

తాజాగా ఈ మూవీ నుంచి బుధవారం (జనవరి 25) సెకండ్ సింగిల్ రిలీజైంది. రుషివనంలోన స్వర్గధామం.. హిమవనంలోన అగ్నివర్షం అంటూ సాగే ఈ మెలోడీ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. ఇంతకుముందే ఈ మూవీ నుంచి మల్లికా అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సెకండ్ సింగిల్ కూడా సిద్ శ్రీరామ్ మెలోడీ వాయిస్ తో మైమరిపించేలా సాగింది.

మెలోడీని ఇష్టపడే వాళ్లు ఈ పాటతో వెంటనే ప్రేమలో పడతారనడంలో సందేహం లేదు. శకుంతల, దుశ్యంతుని మధ్య రొమాన్స్ ను చూపిస్తూ ఈ పాట సాగుతుంది. ఈ మెలోడీకి మణి శర్మ కంపోజ్ చేయగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు. శాకుంతలం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండటంతో ఈ పాటను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు.

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై శాకుంతలం నిర్మించారు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఫిబ్రవరి 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి గతేడాదే మూవీ రిలీజ్ తేదీని అనౌన్స్ చేసినా.. తర్వాత 3డీలోనూ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు శాకుంతలం 3డీలోనూ రిలీజ్ కాబోతోంది.

సంబంధిత కథనం

టాపిక్