Popula Pette Serial: సీనియర్ నరేష్, జంధ్యాల కాంబోలో వచ్చిన క్లీన్ కామెడీ సీరియల్ - ఈటీవీ విన్ ఓటీటీలో రీ టెలికాస్ట్‌-senior naresh jandhyala popula pette telugu serial re telecasted on etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Popula Pette Serial: సీనియర్ నరేష్, జంధ్యాల కాంబోలో వచ్చిన క్లీన్ కామెడీ సీరియల్ - ఈటీవీ విన్ ఓటీటీలో రీ టెలికాస్ట్‌

Popula Pette Serial: సీనియర్ నరేష్, జంధ్యాల కాంబోలో వచ్చిన క్లీన్ కామెడీ సీరియల్ - ఈటీవీ విన్ ఓటీటీలో రీ టెలికాస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
May 28, 2024 12:23 PM IST

Popula Pette Serial: టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జంధ్యాల 1996లో పోపుల పెట్టె పేరుతో ఓ సీరియ‌ల్‌ను తెర‌కెక్కించారు. ఈ సీరియ‌ల్‌లో సీనియ‌ర్ న‌రేష్, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణంతో ప‌లువురు సినిమా ఆర్టిస్టులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సీరియ‌ల్ ఈటీవీ విన్ ఓటీటీలో రీ టెలికాస్ట్ అవుతోంది.

పోపుల పెట్టె  సీరియ‌ల్‌
పోపుల పెట్టె సీరియ‌ల్‌

Popula Pette Serial: తెలుగులో కామెడీ క‌థాంశాల‌తో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు జంధ్యాల‌. తెలుగు చిత్ర‌సీమ‌లో కామెడీకి ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుల్లో జంధ్యాల ముందువ‌రుస‌లో నిలుస్తాడు. కామెడీ సినిమాల ప‌రంగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ నుంచి అనిల్ రావిపూడి వ‌ర‌కు ఎంద‌రికో జంధ్యాల స్ఫూర్తిగా నిలిచారు. త‌న కెరీర్‌లో జంధ్యాల ఓ టీవీ సీరియ‌ల్‌కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈటీవీ ఛానెల్‌ ప్రారంభ‌మైన కొత్త‌లో పోపుల పెట్టె పేరుతో కామెడీ క‌థాంశంతో ఓ టీవీ సీరియ‌ల్‌ను జంధ్యాల రూపొందించాడు.

సీనియ‌ర్ న‌రేష్ లీడ్ రోల్‌లో...

ఈ పోపుల పెట్టె టీవీ సీరియ‌ల్‌లో సీనియ‌ర్ న‌రేష్ లీడ్ రోల్‌లో న‌టించాడు. తెలుగు చిత్ర‌సీమ‌లో అగ్ర క‌మెడియ‌న్స్‌, క్యారెక్ట‌ర్స్ ఆర్టిస్టులుగా పేరుతెచ్చుకొన్న ప‌లువురు న‌టీన‌టులు పోపుల పెట్టె సీరియ‌ల్‌లోకీల‌క పాత్ర‌లు పోషించారు. 1996 నుంచి 1997 వ‌ర‌కు ఏడాది పాటు ఈటీవీలో పోపుల పెట్టే టెలికాస్ట్ అయ్యింది.

ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, సాక్షి రంగ‌రావు..

పోపుల పెట్టె సీరియ‌ల్‌లో సీనియ‌ర్ న‌రేష్‌, కిన్నెర‌తో పాటు ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, సాక్షి రంగారావు, రాజీవ్ క‌న‌కాల చాలా మంది సినిమా ఆర్టిస్ట్‌లు పోపుల‌పెట్టె సీరియ‌ల్‌లో న‌టించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వాలు, వారికి ఎదుర‌య్యే ఇబ్బందులు, క‌ష్టాల‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా జంధ్యాల ఈ సీరియ‌ల్‌లో చూపించారు.

కంప్లీట్ క్లీన్ కామెడీతో జంధ్యాల తెర‌కెక్కించిన ఈ సీరియ‌ల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. పోపుల పెట్టె సీరియ‌ల్‌లో న‌రేష్, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, సాక్షిరంగారావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీన్స్ హిలేరియ‌స్‌గా న‌వ్వించాయి. భార్యా బాధితులుగా ఈ ముగ్గురు త‌మ కామెడీ టైమింగ్‌తో న‌వ్వించారు. ఏడాది త‌ర్వాత అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సీరియ‌ల్ ఆగిపోయింది.

మ‌ళ్లీ రీ టెలికాస్ట్‌...

పోపుల పెట్టె సీరియ‌ల్ ఈటీవీ విన్ ఓటీటీలో మ‌ళ్లీ టెలికాస్ట్ అవుతోంది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ రూపంలో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు మ‌రోసారి తీసుకొచ్చారు. ఈ సీరియ‌ల్ కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. బుల్లితెర‌పై పెద్ద విజ‌యం సాధించిన అమృతం సీరియ‌ల్‌...పోపుల పెట్టె స్ఫూర్తితోనే తెర‌కెక్క‌డం విశేషం.

న‌రేష్ న‌టించిన సీరియ‌ల్‌...

న‌రేష్ విజ‌య్ కృష్ణ న‌టించిన ఒకే ఒక తెలుగు సీరియ‌ల్ కూడా పోపుల పెట్టె కావ‌డం గ‌మ‌నార్హం. తాను గురువుగా భావించే జంధ్యాల‌పై అభిమానంతో ఈ సీరియ‌ల్‌లో న‌టించ‌డానికి న‌రేష్ అంగీక‌రించాడు. జంధ్యాల, న‌రేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండు జ‌ళ్ల సీత‌, పుత్త‌డిబొమ్మ‌, హై హై నాయ‌క‌, చూపులు క‌లిసిన శుభ‌వేళ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లుగా నిలిచాయి.

రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లో...

ప్ర‌స్తుతం న‌రేష్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో ప‌లు సినిమాలు చేస్తోన్నాడు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, మార్టిన్ లూథ‌ర్ కింగ్‌, అన్నీ మంచి శ‌కున‌ములే సినిమాల‌తో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు న‌రేష్. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌లో సీనియ‌ర్ న‌రేష్ ఓ కీల‌క పాత్ర చేస్తోన్నాడు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే అడ‌పాద‌డ‌పా వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తున్నాడు. తెలుగులో మాయ‌బ‌జార్ సేల్‌తో పాటు మోడ్ర‌న్ ల‌వ్ ఇన్ హైద‌రాబాద్‌లో న‌రేష్ ముఖ్య పాత్ర‌లు పోషించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్