Chitram Choodara Review: చిత్రం చూడర రివ్యూ - ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Chitram Choodara Review: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం చూడర మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Chitram Choodara Review: వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం చూడర మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా దర్శకుడు ఆర్ ఎస్ హర్షవర్ధన్ ఈ మూవీని రూపొందించాడు. అల్లరి రవిబాబు, శివాజీరాజా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే…
బాలా సినిమా ఆఫర్...
కొత్తపట్టణం అనే ఊళ్లో రంగారావు (కాశీవిశ్వనాథ్), మొద్దు(ధన్‌రాజ్)లతో కలిసి బాలా (వరుణ్ సందేశ్) నాటకాలు వేస్తుంటాడు. ప్రజలను పీడిస్తోన్న రౌడీకి వ్యతిరేకంగా బాలా ఓ నాటకం వేస్తాడు. ఆ నాటకంలో బాలా నటన చూసి సినిమా ప్రొడక్షన్ మేనేజర్ మ్లలేషం (శివాజీరాజా) ఇంప్రెస్ అవుతాడు. తాము తీయబోతున్న కొత్త సినిమాలో బాలాకు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తాడు.
ఆ సినిమా ఆఫర్ కోసం హైదరాబాద్ వచ్చిన బాలాతో పాటు మొద్దు, రంగారావులు దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. సినిమా ఆఫీస్‌లోనే డబ్బు కొట్టేశారని ముగ్గురిని సీఐ సారంగపాణి (అల్లరి రవిబాబు) అరెస్ట్‌చేస్తాడు. బాలాకు సినిమాలో ఆఫర్ ఇచ్చిన మల్లేషం ..సీఐ సారంగపాణితో కలిసి తెలివిగా బాలా, మొద్దు, రంగారావులను ఈ కేసులో ఇరికిస్తాడు.
అతడు అలా ఎందుకు చేశాడు? ఈ నేరం నుంచి బాలాను, అతడి స్నేహితులను రక్షించిన చిత్ర (శీతల్ భట్) ఎవరు? చిత్రతో బాలాకు ఉన్న సంబంధం ఏమిటి? సినిమాల్లో నటించాలనే బాలా కల నెరవేరిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సాదాసీదా క్రైమ్ థ్రిల్లర్ మూవీ...
చిత్ర చూడర....ఓ సాదాసీదా క్రైమ్ థ్రిల్లర్ కథ. ఏ మాత్రం డెప్త్‌లేని ఓ చిన్న పాయింట్‌ను ఆధారంగా చేసుకొని డైరెక్టర్ హర్షవర్ధన్ ఈ మూవీని తెరకెక్కించాడు. క్రైమ్ కథల్లో ఉంటే ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ ఏవి ఈ సినిమాలో కనిపించవు.
గజిబిజి....
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో హీరోకు ఎదురయ్యే సమస్య, దాని చుట్టూ అల్లుకున్న డ్రామాలోని సంఘర్షణ ఎంత బలంగా వర్కవుట్ అయితే కథ అంత రక్తికడుతుంది. అసలు మెయిన్ పాయింట్ వీక్ అయితే సినిమా మొత్తం గజిబిజీగా మారిపోయింది. అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చిత్రం చూడరా సినిమాను చెప్పొచ్చు.
టీవీ సీరియల్‌ను తలపిస్తూ...
డ్రామా ఆర్టిస్ట్ అయిన హీరో అనుకోకుండా నేరంలో చిక్కుకోవడం, వేశ్య కమ్ ప్రియురాలు అయిన హీరోయిన్ అతడిని కాపాడటం అనే ఔట్ లైన్ బాగుంది. ఈ పాయింట్‌కు టీవీ సీరియల్‌ను తలపించే స్క్రీన్‌ప్లే, సీన్స్‌తో రాసుకోవడంతో సినిమా మొత్తం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది.
ఎలాంటి ట్విస్ట్‌లు లేవు...
సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు హీరో లక్ష్యం ఏమిటి? అతడి క్యారెక్టర్ ఏం చేస్తుందో అంతుపట్టదు. హీరోను క్రైమ్‌లో ఇరికించడానికి ప్రొడక్షన్ మేనేజర్, పోలీస్ ఆఫీసర్ వేసిన ట్రాప్ సిల్లీగా అనిపిస్తుంది. నిజంగానే టీవీ సీరియల్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఆ సీన్ రాసినట్లుగా అనిపిస్తుంది. హీరో తన తెలివితేటలు ఉపయోగించి ఆ క్రైమ్ నుంచి బయటపడతాడా అంటే అదీ లేదు. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సినిమాను ఎండ్ చేశాడు డైరెక్టర్.
డైరెక్టర్ క్రియేటివిటీ...
హీరోహీరోయిన్ల మధ్య పరిచయాన్ని డిఫరెంట్‌గా చూపించడానికి డైరెక్టర్ తన క్రియేటివిటీ మొత్తం వాడేశాడు. ఆ క్రియేటివిటీని భరించడం కష్టమే. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ మొత్తం సాగతీతగా ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇది బాగుందే అనుకునే సీన్...డైలాగ్ సినిమాలో కనిపించదు.
ఎలాంటి పసలేని ఈ కథలో శివాజీరాజా ట్రాక్ ఒక్కటే కాస్తంత నయం అనిపస్తుంది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి చివరకు తాను వేసిన ప్లాన్‌లోనే తానే ఇరుక్కోని ఎలా జైలుపాలయ్యాడన్నది అతడి క్యారెక్టర్ ద్వారా కాస్తంత అర్థవంతంగా చూపించినట్లు అనిస్తుంది.
క్లారిటీ మిస్...
బాలా పాత్రలో వరుణ్ సందేశ్ సరిగ్గా ఇమడలేదు. దర్శకుడు చెప్పిన కథపై తనకే క్లారిటీ లేనట్లుగా అతడి నటన సాగింది. హీరోయిన్ క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా రాసుకున్నాడు. ఆ పాత్రకు తగ్గట్లుగా శీతల్‌భట్ యాక్టింగ్ లేదు. అల్లరి రవిబాబు, శివాజీరాజా, కాశీవిశ్వనాథ్, రాజా రవీంద్రి ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా ఎవరిని సరిగా వాడుకోలేదు. ధన్‌రాజ్, రచ్చ రవి కామెడీలోని ఒక్క సీన్ కూడా నవ్వించలేదు.
స్కిప్ చేయడం బెటర్...
చిత్రం చూడర సిల్లీగా సాగే ఔట్‌డేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థియేటర్ల స్కిప్ చేస్తూ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఆడియెన్స్ కూడా స్కిప్ చేయడం మంచిదే.