Weapon OTT Release Date: బాహుబ‌లి క‌ట్ట‌ప్ప సూప‌ర్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది!-sathyaraj vasanth ravi action thriller movie weapon streaming on aha ott from july 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weapon Ott Release Date: బాహుబ‌లి క‌ట్ట‌ప్ప సూప‌ర్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది!

Weapon OTT Release Date: బాహుబ‌లి క‌ట్ట‌ప్ప సూప‌ర్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది!

Nelki Naresh Kumar HT Telugu
Jul 24, 2024 06:25 AM IST

Weapon OTT Release Date: బాహుబ‌లి ఫేమ్ స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెప‌న్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో రూపొందిన జూలై 26 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

వెప‌న్ మూవీ ఓటీటీ
వెప‌న్ మూవీ ఓటీటీ

Weapon OTT Release Date:బాహుబ‌లి ఫేమ్ స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెపన్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ సినిమాకు గుహన్ సెన్నియప్పన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

వెప‌న్ సినిమాలో సత్యరాజ్ తో పాటు వసంత్ రవి, తాన్యా హోప్ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. జూన్ 7న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ క‌న్ఫ్యూజ‌న్‌గా ఉండటంతో వెప‌న్‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఆహా ఓటీటీలో...

వెప‌న్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 26 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ ఆహా ప్లాట్‌ఫామ్‌లోనే వెప‌న్‌ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. అయితే తెలుగు వెర్ష‌న్ ఆగ‌స్ట్ ఫ‌స్ట్‌వీక్‌లో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

వెప‌న్ క‌థ ఏమిటంటే?

అగ్ని (వ‌సంత్ ర‌వి) ఓ యూట్యూబ‌ర్‌. తేని డిస్ట్రిక్‌లో బాంబు బ్లాస్ట్స్‌జ‌ర‌గ‌డంతో అనుమానంతో అగ్నిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్ర‌పంచానికి తెలియ‌ని సూప‌ర్ హీరో మిత్ర‌న్‌ గురించి తాను వెతుకుతున్నాన‌ని, త‌న‌కు ఈ బ్లాస్ట్‌ల‌తో సంబంధం లేద‌ని పోలీసుల‌కు చెబుతాడు అగ్ని.

సూప‌ర్ హీరో మిత్ర‌న్‌కు అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? అత‌డి కోసం అగ్నితో పాటు బ్లాక్ సొసైటీ 19 అనే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ ఎందుకోసం వెతుకుతున్నారు? ఆ సూప‌ర్ హీరో మంచివాడా? చెడ్డ‌వాడా? నాజీ సైన్యం క‌నిపెట్టిన ఓ సీర‌మ్ ఇండియాలోకి ఎలా వ‌చ్చింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సూప‌ర్ హీరోగా స‌త్య‌రాజ్‌...

సూప‌ర్ హీరో క‌థాంశానికి యాక్ష‌న్, సైన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి ద‌ర్శ‌కుడు వెప‌న్‌ మూవీని తెర‌కెక్కించాడు. ఒకే క‌థ‌లో అనేక అంశాల‌ను జోడిస్తూ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం, బ‌ల‌మైన క్యారెక్ట‌రైజేష‌న్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో సూప‌ర్ హీరోగా స‌త్య‌రాజ్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌మాత్రం బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపించాయి.

ఈ మూవీలో స‌త్య‌రాజ్‌, వ‌సంత్ ర‌వితో పాటు రాజీవ్ మీన‌న్‌, యాషికా ఆనంద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వెప‌న్ మూవీకి సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించాడు. అయితే ఫ‌స్ట్‌పార్ట్ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో సీక్వెల్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అనుమానంగానే మారింది.

బాహుబ‌లితో సెకండ్ ఇన్నింగ్స్‌...

బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప పాత్ర ద్వారా తెలుగులో ఫేమ‌స్ అయ్యాడు స‌త్య‌రాజ్‌. ఒక‌ర‌కంగా బాహుబ‌లి మూవీ స‌త్య‌రాజ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాదిగా నిలిచింది. బాహుబ‌లి త‌ర్వాత తెలుగు త‌మిళ భాష‌ల్లో బిజీయోస్ట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. బాహుబ‌లి త‌ర్వాత తెలుగులో జెర్సీ, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, వాల్తేర్ వీర‌య్య‌తో పాటు ప‌లు సినిమాలు చేశాడు. త‌మిళంతో ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌తో కూలీ మూవీ చేస్తోన్నాడు. బాలీవుడ్ నుంచి స‌త్య‌రాజ్‌కు ప‌లు అవ‌కాశాలు వ‌స్తోన్నాయి.స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న సికంద‌ర్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో స‌త్య‌రాజ్ క‌నిపించ‌బోతున్నాడు.

మ‌రోవైపు జైల‌ర్ మూవీలో ర‌జ‌నీకాంత్ కొడుకు పాత్ర‌లో వ‌సంత్ ర‌వి క‌నిపించాడు. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ రోల్ చేశాడు.

టాపిక్