OTT Bold Web Series: ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అంజలి బోల్డ్ థ్రిల్లర్ సిరీస్.. రికార్డుస్థాయిలో వ్యూస్
Bahishkarana OTT Web Series: బహిష్కరణ వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. అంజలి మెయిన్ రోల్ చేసిన ఈ సిరీస్ భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది. ఓ భారీ మైలురాయి కూడా అధిగమించింది.
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన బహిష్కరణ వెబ్ సిరీస్ మొదటి నుంచి ఆసక్తి రేపింది. ఫస్ట్ లుక్ నుంచి ఈ సిరీస్‍పై బజ్ ఏర్పడింది. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్‍లో అంజలి వేశ్యపాత్ర చేయటంతో స్టోరీ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍కు ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. బహిష్కరణ వెబ్ సిరీస్ జూలై 19న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్ సెన్సేషన్ సృష్టిస్తోంది.
రికార్డుస్థాయి వ్యూస్
బహిష్కరణ వెబ్ సిరీస్‍కు అప్పుడే భారీగా వ్యూస్ వచ్చాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ సిరీస్ 3.5 కోట్ల వ్యూయింగ్ నిమిషాలను దాటేసింది. ఈ సిరీస్ రికార్డు బ్రేకింగ్ వ్యూస్ సాధించిందని జీ5 ఓటీటీ నేడు (జూలై 23) వెల్లడించింది. “మూడురోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ 35 మిలియన్ (3.5 కోట్లు) వ్యూయింగ్ మినిట్స్” అని జీ5 సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బహిష్కరణ వెబ్ సిరీస్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అంజలి పర్ఫార్మెన్స్ మెప్పించింది. పుష్ప అనే వేశ్యను ఆమె పోషించారు. బోల్డ్, రస్టిక్‍గా ఉన్న పాత్రలో అంజలి అదరగొట్టారు. ఈ సిరీస్‍లో రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, అనన్య నాగళ్ల, షణ్ముఖ్, మహబాబ్ పాషా, చైతన్య సగియేజు కీలకపాత్రలు పోషించారు.
బహిష్కరణ సిరీస్‍ను రస్టిక్ విలేజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు ముకేశ్ ప్రజాపతి. ఈ ఇంటెన్స్ డ్రామాను ఇంట్రెస్టింగ్‍గా రూపొందించారు. అక్కడక్కగా సాగదీతగా అనిపించినా.. ఓవరాల్‍గా ఈ సిరీస్ ఆకట్టుకుంది. దీంతో ఈ సిరీస్‍కు ఎక్కువగా పాజిటివ్ స్పందన రావటంతో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ సిరీస్‍లో ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి.
బహిష్కరణ వెబ్ సిరీస్‍ను పిక్సెల్ పిక్చర్స్ పతాకంపై ప్రశాంత మలిశెట్టి నిర్మించారు. సిద్ధార్థ్ సదాశువుని సంగీతం అందించిన ఈ సిరీస్‍కు ప్రసన్న ఎస్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.
సక్సెస్ మీట్
బహిష్కరణ సిరీస్ భారీ వ్యూస్ దక్కించుకుంటుడటంతో నేడు (జూలై 23) సక్సెస్ మీట్ నిర్వహించింది జీ5. అంజలి, రవీంద్ర విజయ్, దర్శకుడు ముకేశ్ ప్రజాపతి సహా మరికొందరు ఈ మీట్‍లో పాల్గొన్నారు.
బహిష్కరణ స్టోరీ లైన్
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో బహిష్కరణ సిరీస్ స్టోరీ సాగుతుంది. ఆ ప్రాంతానికి పెద్దగా ఉండే శివయ్య (రవీంద్ర విజయ్) తన అధికారంతో మహిళల జీవితాలను నాశనం చేస్తుంటాడు. పుష్ప (అంజలి) అనే వేశ్యతోనూ సంబంధం కొనసాగిస్తుంటాడు. దర్శి (శ్రీ తేజ) అనే యువకుడు పుష్పను ప్రేమిస్తాడు. పుష్ప కూడా అతడి ప్రేమను అంగీరికరిస్తుంది. వారిద్దరూ వెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే లక్ష్మి (అనన్య నాగళ్ల)తో దర్శి పెళ్లి అయ్యేలా శివయ్య కుట్ర పన్నుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దర్శి జైలుకు ఎందుకు వెళ్లాడు? శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే విషయాలు బహిష్కరణ సిరీస్‍లో ఉంటాయి. ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లుగా వచ్చింది. మూడు గంటల్లోపు నిడివితోనే ఈ సిరీస్ ఉంది.