Weapon Release Date: సూప‌ర్ హీరో పాత్ర‌లో బాహుబ‌లి క‌ట్ట‌ప్ప - వెప‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే?-sathyaraj tanya hope weapon movie release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weapon Release Date: సూప‌ర్ హీరో పాత్ర‌లో బాహుబ‌లి క‌ట్ట‌ప్ప - వెప‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే?

Weapon Release Date: సూప‌ర్ హీరో పాత్ర‌లో బాహుబ‌లి క‌ట్ట‌ప్ప - వెప‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 31, 2024 12:15 PM IST

Weapon Release Date: స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సూప‌ర్ హీరో మూవీ వెప‌న్ జూన్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో జైల‌ర్ ఫేమ్ వ‌సంత్ ర‌వితో పాటు తాన్య హోప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

స‌త్య‌రాజ్  వెప‌న్ మూవీ
స‌త్య‌రాజ్ వెప‌న్ మూవీ

Weapon Release Date:బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్‌తో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యాడుస‌త్య‌రాజ్‌. బాహుబ‌లి మూవీతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీగా మారిపోయాడు. మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌తో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు స‌త్య‌రాజ్‌.

జూన్ 7న రిలీజ్‌...

స‌త్య‌రాజ్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న వెప‌న్‌ మూవీ జూన్ 7న రిలీజ్ కాబోతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు గుహన్ సెన్నియప్పన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెప‌న్ సినిమాలో సత్యరాజ్ తో పాటు వసంత్ రవి, తాన్యా హోప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. వెప‌న్ తెలుగు ట్రైల‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు.

యాక్ష‌న్ అంశాల‌తో...

యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌ను క‌లిగిస్తోంది. ఇందులో మోన్‌స్ట‌ర్‌గా, సూప‌ర్ హ్యూమ‌న్‌గా స‌త్య‌రాజ్ క‌నిపించాడు. అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి కొంద‌రు యోధుల‌తో కూడిన ఓ టీమ్ ఎలా ప్ర‌య‌త్నించింది? సూప‌ర్ హ్యూమ‌న్‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఇత‌ర టీమ్‌లు ఎందుకు క‌నిపించ‌కుండాపోయాయి? అస‌లు అత‌డు ఎవ‌రు అనే అంశాల‌తో ట్రైల‌ర్ థ్రిల్లింగ్‌ను పంచింది. స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్‌కు ఇచ్చిన ఎలివేష‌న్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

బాహుబ‌లి త‌ర‌హాలోనే...

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌త్య‌రాజ్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం సినిమాకు భాష అనేది హద్దుగా లేదు. బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి సినిమానే అవుతుంది సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత మన్జూర్ ఈ మూవీని నిర్మించాడు అని అన్నాడు.

క‌ట్ట‌ప్ప త‌ర్వాత‌...

వసంత్‌ రవి మాట్లాడుతూ.. ఫాంట‌సీ యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ గుహ‌న్ ఈ కథను రాశారు. ఈ మూవీలో చాలా సీజీ వర్క్ ఉంది. కట్టప్ప పాత్ర తరువాత సత్య రాజ్ గారు మళ్లీ అలాంటి ఓ యాక్షన్ రోల్‌లో ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది.

సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్‌లా మా సినిమా ఒక సూపర్ హీరో మూవీగా నిలిచిపోతుంది అని తెలిపాడు. వెప‌న్ మూవీతో చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం ఆనందంగా ఉంది. వెపన్ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక యూనిక్ మూవీ అని తాన్య హోప్ చెప్పింది.

సైఫై థ్రిల్ల‌ర్‌...

డైరెక్ట‌ర్ గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ.. వెప‌న్ సైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ. సత్యరాజ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. న‌టుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. వసంత్ రవి యాక్ష‌న్ పాత్రను చేశారు. సెకండాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. తాన్య హోప్ క్యారెక్ట‌ర్ ఎమోషనల్ యాంగిల్‌లో సాగుతుందిజూన్ 7 రాబోతోన్న ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అని అన్నారు.

జైల‌ర్ మూవీలో ర‌జ‌నీకాంత్ కొడుకు పాత్ర‌లో వ‌సంత్ ర‌వి క‌నిపించాడు. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ రోల్ చేశాడు.

టాపిక్