OTT Top 5 Releases in this Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. ఓ తెలుగు మూవీ నేరుగా.. బాహుబలి సిరీస్ కూడా..-ott top 5 releases this week bastar to vidya vasula aham bahubali crown of blood and more zee5 aha jiocinema hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top 5 Releases In This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. ఓ తెలుగు మూవీ నేరుగా.. బాహుబలి సిరీస్ కూడా..

OTT Top 5 Releases in this Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. ఓ తెలుగు మూవీ నేరుగా.. బాహుబలి సిరీస్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
May 13, 2024 03:30 PM IST

Top 5 OTT Releases in this Week: ఈ వారం మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో అడుగుపెట్టనున్నాయి. ఓ తెలుగు సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. బాహుబలి యానిమేషన్ సిరీస్‍పై కూడా ఫుల్ క్రేజ్ ఉంది.

Top 5 OTT Releases in Week: ఈ వారం ఓటీటీల్లోకి టాప్-5 రిలీజ్‍కు ఇవే.. ఓ తెలుగు మూవీ నేరుగా.. బాహుబలి సిరీస్ కూడా..
Top 5 OTT Releases in Week: ఈ వారం ఓటీటీల్లోకి టాప్-5 రిలీజ్‍కు ఇవే.. ఓ తెలుగు మూవీ నేరుగా.. బాహుబలి సిరీస్ కూడా..

Top 5 OTT Releases in this Week: ఈ వారం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు దూసుకొచ్చేస్తున్నాయి. ఓటీటీల్లో కంటెంట్ చూడాలనుకునే వారికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఓ తెలుగు సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు రానుండగా.. రెండు పాపులర్ బాలీవుడ్ చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ కూడా రానుంది. ఈ వారం (మే మూడో వారం) ఓటీటీల్లో టాప్-5 ఓటీటీ రిలీజ్‍లు ఇవే.

విద్యా వాసుల అహం

విద్యా వాసుల అహం సినిమా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ సినిమా మే 17వ తేదీన ఆహా అడుగుపెట్టనుంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన దంపతులు.. ఈగోతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. విద్యా వాసుల అహం చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు.

బస్తర్: ది నక్సల్ స్టోరీ

‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా మే 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. నక్సలైట్లను అరికట్టేందుకు రంగంలోకి దిగి పోరాడే ఐపీఎస్ నీరజా మాధవన్ అనే పాత్రను ఈ చిత్రంలో ఆదా పోషించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కేరళ స్టోరీ కాంబోలో వచ్చిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోయింది. ఈ బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ మే 17వ తేదీన జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వస్తుంది.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బ్లాక్‍బస్టర్లుగా నిలిచిన బాహుబలి సినిమాల స్ఫూర్తితో ఈ యానిమేటెడ్ సిరీస్ రూపొందింది. దీంతో ఈ సిరీస్‍కు ఫుల్ క్రేజ్ ఉంది. ట్రైలర్ కూడా మెప్పించింది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ మే 17న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది.

జర హట్కే జర బచ్కే

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘జర హట్కే జర బచ్కే’ మే 17వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. థియేటర్లలో రిలీజైన సుమారు పదకొండున్నర నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెడుతోంది. హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. లక్ష్మణ్ ఉతేతర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 2023 జూన్ 2న థియేటర్లలో రిలీజై మంచి హిట్ అయింది. నెలల నిరీక్షణ తర్వాత ఈ వారంలోనే మే 17న జియో సినిమా ఓటీటీలో జర హట్కే జర బచ్కే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

తలైమై సేయలగం

తలైమై సేయలగం పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మే 17వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్‍లో తమిళ నటుడు రాహుల్, శ్రీయారెడ్డి, భరత్, రమ్య, నంబీషన్, ఆదిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు వసంతబాలన్ దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ సంగీతం అందించారు. తలైమై సేయలగం సిరీస్‍ను మే 17 నుంచి జీ5లో చూసేయవచ్చు.