Saripodhaa Sanivaaram Box Office: పడిపోయిన సరిపోదా శనివారం కలెక్షన్స్- 2 డేస్ కలెక్షన్స్ ఇవే! ఎన్ని కోట్లు రావాలంటే?
Saripodhaa Sanivaaram 2 Days Worldwide Collection: హీరో నాని లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయింది. కానీ, రెండో రోజు మాత్రం పడిపోయాయి. ఆగస్ట్ 29న విడుదలైన సరిపోదా శనివారం మూవీకి 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
Saripodhaa Sanivaaram Box Office Collection: హీరో నాని, మలయాళ ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా 'సరిపోదా శనివారం'. ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, విడుదలైన రెండో రోజే శనివారం (ఆగస్ట్ 30) కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
తొలి రోజు 9 కోట్లు
డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో నాని, ప్రియాంకతోపాటు ఎస్‌జే సూర్య, సాయి కుమార్, మురళి శర్మ, అజయ్ ఘోష్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే, ట్రేడ్ వర్గాల ప్రకారం సరిపోదా శనివారం సినిమా ఇండియాలో రూ.9 కోట్ల నెట్ కలెక్షన్లతో ప్రారంభమైంది.
రెండో రోజు కలెక్షన్స్
ఈ తొమ్మిది కోట్లల్లో తెలుగు నుంచి రూ. 8.75 కోట్లు, తమిళం నుంచి రూ. 24 లక్షలు, మలయాళంలో రూ. లక్షగా కలెక్షన్స్ ఉన్నాయి. ఇక రెండో రోజు అన్ని భాషల్లో కలిపి సరిపోదా శనివారం ఇండియాలో రూ. 5.75 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది. అంటే, తొలి రోజుతో పోల్చి చూస్తే.. రెండో రోజు వసూళ్లు రూ. 3.25 కోట్ల వరకు పడిపోయాయి.
2 డేస్ కలెక్షన్స్
దీంతో సరిపోదా శనివారం సినిమాకు రెండు రోజుల్లో భారతదేశంలో రూ.14.75 కోట్ల నికర వసూళ్లు వచ్చాయి. అలాగే రెండో రోజుల తెలుగులో 39.34 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక ఈ సినిమాకు రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, రూ. 50 కోట్ల మార్క్‌కు దగ్గరిగా సరిపోదా శనివారం కలెక్షన్స్ ఉన్నాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇదిలా ఉంటే, సరిపోదా శనివారం సినిమాకు ఓవరాల్‌గా రూ. 41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో రూ. 42 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే, ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కావాలంటే ఇంకా రూ. 28 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. అలా అయితేనే నానికి మరో హిట్ పడినట్లు అవుతుంది.
పాన్ ఇండియా స్థాయిలో
కాగా ఈ యాక్షన్ డ్రామాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఎస్‌జే సూర్య, అభిరామి, అదితి బాలన్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.
ఇద్దరితో రెండో సినిమా
ఇదివరకు వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో అంటే సుందరానకీ మూవీ వచ్చింది. దీనికి మిక్స్‌డ్ వ్యూస్ వచ్చాయి. అలాగే ప్రియాంక అరుల్ మోహన్‌తో నాని ఇదివరకు గ్యాంగ్ లీడర్ సినిమా చేశాడు. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇలా వివేక్, ప్రియాంకతో నానికి సరిపోదా శనివారం రెండో సినిమా అయింది.