Sandeep Reddy Vanga: నేను నాలుగేళ్లు బిజీ.. డేట్స్ ఖాళీ లేవు.. స్పిరిట్ రిలీజ్ అప్పుడే: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా-sandeep reddy vanga says he is busy next four years animal director has spirit with prabhas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sandeep Reddy Vanga: నేను నాలుగేళ్లు బిజీ.. డేట్స్ ఖాళీ లేవు.. స్పిరిట్ రిలీజ్ అప్పుడే: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నేను నాలుగేళ్లు బిజీ.. డేట్స్ ఖాళీ లేవు.. స్పిరిట్ రిలీజ్ అప్పుడే: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Hari Prasad S HT Telugu
Aug 26, 2024 04:35 PM IST

Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాను నాలుగేళ్ల పాటు బిజీ అని చెప్పాడు. అసలు తన డేట్స్ ఖాళీ లేవని కూడా అతడు చెప్పడం విశేషం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో ఈ తెలుగు డైరెక్టర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయింది.

నేను నాలుగేళ్లు బిజీ.. డేట్స్ ఖాళీ లేవు.. స్పిరిట్ రిలీజ్ అప్పుడే: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
నేను నాలుగేళ్లు బిజీ.. డేట్స్ ఖాళీ లేవు.. స్పిరిట్ రిలీజ్ అప్పుడే: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా తెలుసు కదా. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి.. తాజాగా యానిమల్ మూవీతో మరో రేంజ్ కు వెళ్లిపోయిన డైరెక్టర్ అతడు. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నాడు. కొంతకాలంగా పెద్దగా వార్తల్లో లేని ఈ డైరెక్టర్.. తాజాగా తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ.. నాలుగేళ్ల పాటు తాను చాలా బిజీ అని అనడం విశేషం.

సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టులు

కాలేజ్ స్టూడెంట్స్ తో చేసిన ఓ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతన్ని తన వచ్చే ఐదేళ్ల ప్లాన్ ఏంటని ప్రశ్నించారు. దీనికి అతడు స్పందిస్తూ.. "నా ఐదేళ్ల ప్లాన్ గురించి నాకు తెలియదు. కానీ వచ్చే నాలుగేళ్లు మాత్రం నేను చాలా బిజీ.

నా రెండు సినిమాలతో బిజీగా ఉంటాను. తర్వాత భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాను" అని అన్నాడు. ఈ ఈవెంట్లోనే ప్రభాస్ తో తాను చేయబోయే స్పిరిట్ మూవీ గురించి కూడా సందీప్ రెడ్డి స్పందించాడు.

స్పిరిట్ గురించి ఏమన్నాడంటే..

ప్రభాస్ నటిస్తున్న మూవీస్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు చేసిన సందీప్ రెడ్డితో ప్రభాస్ తో చేతులు కలపడంతో ఈ స్పిరిట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా గురించి సందీప్ స్పందిస్తూ.. "ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ చేస్తాం. 2026లో రిలజ్ అవుతుంది" అని చెప్పాడు. అంతేకాదు అతడు యానిమల్ మూవీకి సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

యానిమల్ పార్క్‌పై సందీప్..

గతేడాది వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ యానిమల్. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర, తర్వాత ఓటీటీలో దుమ్ము రేపింది. ఈ మూవీకి ఇప్పుడు యానిమల్ పార్క్ అంటూ రెండో పార్ట్ రాబోతోంది. దీనిపై సందీప్ రెడ్డి స్పందించాడు.

"నా వరకు ఈ సినిమా 2028లో వస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను రెండే సినిమాలతో బిజీగా ఉన్నాను. స్పిరిట్ 2026లో వస్తుంది. ఇక యానిమల్ పార్క్ 2028లో వస్తుంది. ఇవి రెండు తప్ప నాకు మిగతా ప్లాన్స్ ఏవీ లేవు" అని సందీప్ చెప్పాడు.

అప్పుడే చెబుతాను: సందీప్

ప్రభాస్ తో స్పిరిట్ మూవీపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తన సినిమాల్లో మ్యూజిక్ కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సందీప్.. ప్రస్తుతం స్పిరిట్ కోసం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పై పని చేస్తున్నాడు. ఈ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని, అప్పుడే మూవీ రిలీజ్ తోపాటు ఇతర విషయాల గురించి వివరంగా చెబుతానని అన్నాడు.

వచ్చే నాలుగేళ్లలో అతడు అందించబోయే రెండు సినిమాల గురించి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అతడు యానిమల్ లాగే ఈ రెండు సినిమాలపైనా ఉన్న అంచనాలను అందుకుంటాడా లేదా చూడాలి.